హాస్పిటల్ బెడ్ పై సమంత.. ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందంటే?

సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి అందరి చేత శబాష్ అనిపించు కుంది.

 Samantha Promises A Spooky Film With Yashoda First Glimpse Details, Samantha, Ya-TeluguStop.com

ఈమె విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.ప్రెసెంట్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచింది.

అలాగే యశోద షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసింది.ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.

ఈ సినిమా అప్డేట్ కోసం సామ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరిన్ని అంచనాలను క్రియేట్ చేసారు.

ఈ గ్లిమ్స్ లో సమంత హాస్పిటల్ బెడ్ మీద ఉంది.తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కిటికీ దగ్గరికి వచ్చి బయటకు చూస్తూ పావురాన్ని పట్టుకోవాలని అనుకుంది.

ఈ గ్లిమ్స్ తో చిన్నపాటి క్యూరియాసిటీ పెంచేశారు.

అసలు సమంత హాస్పిటల్ బెడ్ మీద ఎందుకు ఉంది.అనేది సినిమా చుస్తే కానీ తెలియదు.

ఈ సినిమా కూడా డిఫెరెంట్ గా తెరకెక్కింది.సమంత మరోసారి ఇలాంటి కథ ఎంచుకోవడంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube