శివగామి పాత్రలో సమంత కనిపించబోతుందా.?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కెరియర్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ కాకుండా విభిన్న తరహాలో రిప్రజెంట్ అయ్యే పాత్రలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తుంది.

 Samantha Play Sivagami Role In Web Series-TeluguStop.com

ఈ నేపధ్యంలో రంగస్థలం, మజిలీ, ఓబేబీ లాంటి హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో మరోసారి సమంత తనలోని గొప్పనటిని బయటకి తీసుకొచ్చి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.

వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర భాగా క్లిక్ అవ్వడంతో ది ఫ్యామిలీ మెన్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే సమంత లీడ్ రోల్ లో అదే రోల్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఫ్యామిలీ మెన్ సక్సెస్ తో సమంత క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

 Samantha Play Sivagami Role In Web Series-శివగామి పాత్రలో సమంత కనిపించబోతుందా.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డిజిటల్ మీడియా సంస్థలు ఇప్పుడు ఈ అమ్మడుతో కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకొస్తున్నారు.

ఈ నేపధ్యంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ సమంతతో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.

గతంలో బాహుబలిలో శివగామి పాత్రతో ది రైజింగ్ ఆఫ్ శివగామి టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ ని భారీ బడ్జెట్ తో స్టార్ట్ చేశారు.అయితే కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత అవుట్ పుట్ సరిగా రాలేదని దాన్ని ఆపేశారు.

అయితే ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ని తిరిగి స్టార్ట్ చేసే ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ ఉంది.దానికోసం భారీగా ఖర్చుపెట్టడానికి రెడీ అవుతుంది.ఇక ఈ వెబ్ సిరీస్ లో శివగామి పాత్రకి సమంతని తీసుకునే యోచనలో నెట్ ఫ్లిక్స్ ఉందని తెలుస్తుంది.శివగామి పాత్ర భాగా వర్క్ అవుట్ కావడంతో సమంత కూడా ఆ రోల్ లో కనిపించడానికి సుముఖంగానే ఉన్నట్లు వినికిడి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న శాకుంతలంలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ 40 శాతం వరకు పూర్తయినట్లు తెలుస్తుంది.

#Web Series #Netflix #SamanthaPlay #Bahubali #TheFamily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు