రియాలిటీ షోకి సిద్ధమవుతున్న అక్కినేని కోడలు  

Samantha Plan To Talk Show On Small Screen-plan To Talk Show,samantha,small Screen,tollywood

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత.తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో ఆదిపాడిన ఈ భామ.

Samantha Plan To Talk Show On Small Screen-Plan Samantha Small Screen Tollywood

తన మొదటి సినిమా హీరో అక్కినేని చైతూతో సుదీర్ఘ కాలంలో లవ్ స్టొరీని నడిపి మొత్తానికి రెండేళ్ళ క్రితం పెళ్లి బంధంతో ఇద్దరు ఒకటయ్యారు.దీంతో ఇప్పుడు సమంత అక్కినేని ఇంటి కోడలు అయిపొయింది.

పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తున్న సమంతకి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు దగ్గుబాటి ఫ్యామిలీ, ఇటు అక్కినేని ఫ్యామిలీలో అండగా ఉన్నాయి.దీంతో హీరోయిన్ గా చేస్తూనే సోలోగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు లేడీ ఓరియంటెడ్ కథలతో సందడి చేస్తుంది.

ఇక ఆమెతో సినిమాలు నిర్మించేందుకు రెండు పెద్ద బ్యానర్ లు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం 96 రీమేక్ గా వస్తున్న జాను సినిమాలో శర్వానంద్కి జోడీగా అక్కినేని సమంత నటిస్తుంది.

దీని తర్వాత భర్త చైతూతో మరో సినిమా చేయనుంది.ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత బుల్లితెరపై సందడి చేయడానికి ఈ భామ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.తన ఇంటి బ్యానర్ ఆయినా అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా సీరియల్స్ తెరకేక్కుతున్నాయి.

ఈ బ్యానర్ లో ఓ రియాలిటీ టాక్ షో సమంత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మంచు లక్ష్మి తరహాలోనే తాను కూడా వ్యాఖ్యతగా మారి టాక్ షో చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ షో కోసం సమంత తెలుగుని స్పష్టంగా మాట్లాడటం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.

.

తాజా వార్తలు

Samantha Plan To Talk Show On Small Screen-plan To Talk Show,samantha,small Screen,tollywood Related....