అప్పట్లో అక్కడ పార్ట్ టైమ్ పని చేసిన సమంత!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో తన కెరీర్ ను మొదలు పెట్టిన సమంత… తమిళ చిత్ర పరిశ్రమలు కూడా నటించి సత్తా చాటింది.అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది.

 Samantha Part Time Job As Fashion Designer, Samantha, Part Time Job, Fashion Des-TeluguStop.com

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిన సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అక్కినేని పెద్ద కోడలు అయ్యి ఎంత బాధ్యతగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
2007లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఓ సినిమాలో నటించగా పెద్దగా హిట్ అవ్వక ఎవరికి తెలియలేదు.అయితే 2010 తెలుగులో “ఏం మాయ చేసావే” సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది సమంత.

ఈ సినిమాలో తన పాత్ర లో ఎంతో బాగా నటించి స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకుంది.తమిళ్, తెలుగు భాషల్లో దాదాపు 27 సినిమాలలో నటించి తమిళ్, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ .
హీరో నానితో నటించిన ఎటో వెళ్లిపోయింది చిత్రంతో కూడా ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది.కేవలం సినిమాల్లోనే కాకుండా నిత్య జీవితంలోను ప్రేక్షకులకు ఎన్నో సలహాలు ఇచ్చి తెలుగువారి మనసు గెలుచుకుంది.

ఇక ఇప్పుడు మెగా కోడలు కొణిదెల ఉపాసనతో కలిసి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని టిప్స్ ఇస్తూ నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తుంది ఈ అందాల భామ.
ఇటీవలే సాకీ వరల్డ్ గురించి వీడియో ని తీసి అందులో తను ” మీరంతా కలసి హాయిగా నవ్వుకునేందుకు సరైన సమయం ఇదే” అంటూ ఒక షార్ట్ వీడియోలో నటించింది.అయితే అంతటి గొప్ప ”అక్కినేని కోడలు సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్ట్ టైమ్ ఉద్యోగంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేసేదట”.ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube