డ్యాన్స్ మూమెంట్స్ తో మరోసారి అదరగొట్టిన సమంత.. వీడియో వైరల్!

టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు అనిపిస్తుంది.సమంత తన అందంతో, నటనతో నే కాకుండా తను తన వ్యక్తిగత జీవితంలో ఉండే విధానం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Samantha Once Again Supported With Dance Moments Video Goes Viral Samantha, Toll-TeluguStop.com

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ఫాలోవర్స్ కు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది.

వెండితెర లోనే కాకుండా బుల్లితెరలో కూడా సమంత నటనకు బాగా ఆకర్షితులయ్యారు అభిమానులు.

ఆమె ఉండే విధానం, మాట్లాడే విధానం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.ఇక సినిమాలలో సమంత నటనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

వరుస ఆఫర్లతో సమంత టాలీవుడ్ లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా వెబ్ సిరీస్ ల తో బాగా బిజీ గా మారింది.

Telugu Dance, Samantha, Tollywood, Womens Day-Movie

ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.అందులో సమంత మరో అమ్మాయితో కలిసి డాన్స్ చేస్తూ బాగా ఆకట్టుకుంది.ఇక ఈ పోస్టు ను చూసిన నెటిజనులు సమంత డాన్స్ కు ఫిదా అయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సమంత పాత్ర శకుంతల గా కనిపించనుంది.

ఇక ఇందులో దుష్యంతుడు గా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు.మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

అంతే కాకుండా సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించగా ఇందులో సమంత పాత్ర టెర్రరిస్టుగా నటించింది.ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube