మరోసారి పవన్ కళ్యాణ్ కి జోడీగా సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్న అందాల భామ సమంత అక్కినేని.చైతూతో పెళ్లి అయిన తర్వాత కూడా సమంత నటిగా కొనసాగుతూ మరింత పవర్ ఫుల్ రోల్స్ ని సెలక్ట్ చేసుకుంటూ ముందుకి పోతుంది.

 Samantha Once Again Paired With Pawan Kalyan-TeluguStop.com

అలాగే గ్లామర్ షో విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.రంగస్థలం, మజిలీ, ఓ బేబీ సినిమాలతో పెళ్లి తర్వాత సమంతా హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది.

తాజాగా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో రాజ్యలక్ష్మి పాత్రతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.దీంతో ఇప్పుడు హిందీలో కూడా సమంతకి ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయి.

 Samantha Once Again Paired With Pawan Kalyan-మరోసారి పవన్ కళ్యాణ్ కి జోడీగా సమంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సమంత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా అత్తారింటికి దారేది సినిమాలో నటించింది.

ఈ సినిమాలో పవన్, సమంతా కెమిస్ట్రీ భాగా వర్క్ అవుట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ మరో సారి రిపీట్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.హరీష్ శంకర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో హీరోయిన్స్ గా సమంతని తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Telugu Hari Hara Veeramallu, Harish Shankar, Pawan Kalyan, Samantha, The Family Men 2, Tollywood-Movie

ముందు నుంచి హరీష్ శంకర్ దృష్టి మొత్తం పూజా హెగ్డే మీదనే ఉంది.అయితే పూజా హెగ్డే హిందీ సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేసే అవకాశం తక్కువగా ఉంది. అలాగే రష్మిక మందన కూడా ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో ఏకంగా ఐదు సినిమాలని చేతిలో పెట్టుకొని ఉంది.

ఈ నేపధ్యంలో సమంత బెటర్ ఉద్దేశ్యంతో హరీష్ శంకర్ ఆమె కోసం ప్రయత్నం చేస్తున్నట్లు బోగట్టా.ఇప్పటికే ఆమెకి స్టొరీ నేరేట్ చేయడం జరిగిందని, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

#Pawan Kalyan #Samantha #Harish Shankar #HariHara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు