పూజా హెగ్డే కి చెక్ పెట్టనున్న సమంత..!?

గత సంవత్సరం అక్కినేని వారసుడు నాగచైతన్య ను వివాహం చేసుకొని అక్కినేని ఇంటికి కోడలిగా వచ్చిన సమంత ఆ తర్వాత కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతూ విజయాలను సొంతం చేసుకుంటుంది.గత సంవత్సరం ఓ బేబీ తో, ఆ తర్వాత 2020 మొదట్లోనే జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని సమంత.

 Samantha With Ntr Again In Trivikram Movie, Samantha, Pooja Hegde, Ntr30, Trivik-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం తమిళ్ లో నయనతారతో కలిసి వెండితెరను షేర్ చేసుకుంటోంది.అలాగే ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తోంది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ అలాగే డబ్బింగ్ కూడా పూర్తి చేసింది సమంత.ఇకపోతే తాజాగా ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా మొదలు కాబోతోంది.ఇందుకు సంబంధించి కాస్టింగ్ విషయంలో హీరోయిన్ ఎంచుకోవాలన్న మూవీమేకర్స్ ముందుగా సమంతను సంప్రదించినట్లు సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా సాగుతున్న పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ అన్నట్లుగా ముందుగా ప్రచారం జరిగింది.కాకపోతే, ప్రస్తుతం పూజా హెగ్డే చాలా సినిమాలో నటించడంతో అలాగే బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తానని కమిట్ కావడంతో ఈ సినిమాకు సంబంధించి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంవల్ల మూవీ మేకర్స్ సమంత వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


అయితే ఇది వరకు త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ.ఆ.సినిమాలో సమంత హీరోయిన్ గా నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే.అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఇదివరకు జనతాగ్యారేజ్, రామయ్యా వస్తావయ్యా, రభస, బృందావనం లాంటి సినిమాల్లో నటించి భారీ విజయాలను అందుకుంది.

మరి ఈసారి ఎన్టీఆర్ -సమంత- త్రివిక్రమ్ కాంబో ఉంటే భారీ అంచనాలే పెట్టుకోవచ్చు.అది కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube