సమంత భరణం తీసుకోకపోవడానికి వెలుగులోకి మరో కారణం.. అతని ఆదాయం తగ్గడంతో?

స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య నుంచి భరణం తీసుకోవడం లేదనే సంగతి తెలిసిందే.సమంత చైతన్య నుంచి భరణం తీసుకోకపోవడానికి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వచ్చాయి.

 Samantha Not Taking Alimony From Chaitanya Here Is The Reason Details, Chaitanya-TeluguStop.com

ముఖ్యంగా అగ్రిమెంట్ వల్ల సమంత భరణం తీసుకోవడం లేదనే కామెంట్లు వినిపించాయి.సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయిన సమయంలో భారీ మొత్తంలో భరణం తీసుకోవడం జరుగుతుందనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన జంటగా చైతన్య సమంత పేరును సొంతం చేసుకున్నారు.2017 సంవత్సరంలో చైతన్య, సమంతలకు వివాహం జరగగా నాలుగు సంవత్సరాలు కాకముందే వీళ్లిద్దరూ విడాకుల దిశగా అడుగులు వేయడం గమనార్హం.చైతన్య సమంత విడిపోయిన తర్వాత వాళ్ల గురించి ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.సమంత పరువుకు భంగం కలిగించే కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భరణం గురించి అనేక వార్తలు ప్రచారంలోకి రాగా సమంత ఆస్తుల విలువ ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆమెకు భరణం అవసరం లేదని సమాచారం.

Telugu Chaitanya, Alimony, Samantha-Movie

మరోవైపు చైతన్య ఆదాయంతో పోలిస్తే సమంత ఆదాయమే ఎక్కువని తెలుస్తోంది.సమంతకు సినిమాలతో పాటు బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా భారీగానే ఆదాయం దక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Telugu Chaitanya, Alimony, Samantha-Movie

కుటుంబపరంగా చైతన్యకు ఆస్తులు ఉన్నప్పటికీ ఆ ఆస్తులు చైతన్య పేరుపై లేవని తెలుస్తోంది.చైతూ మార్కెట్ కూడా తెలుగుకే పరిమితం కావడంతో చైతన్య నుంచి సమంత భరణం తీసుకునే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.మరోవైపు ఒక దశలో చైతన్య నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో పాటు అతని మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడిందనే విషయం తెలిసిందే.

మరోవైపు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube