మళ్లీ బెల్లంకొండకు ఓకే చెప్పిన సమంత... ఈసారి డబుల్‌  

  • బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా పరిచయం అయిన ‘అల్లుడు శీను’ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటించిన విషయం తెల్సిందే. స్టార్‌ హీరోయిన్‌ అయిన సమంత ఎలా కొత్త హీరోకు జోడీగా నటించింది అంటూ అంతా అవాక్కయ్యారు. అయితే సమంత భారీ పారితోషికం కారణంగా ఆ చిత్రంలో నటించిందని అంతా అన్నారు. అల్లుడు శీను చిత్రం కోసం సమంత ఏకంగా 1.5 కోట్ల రూపాయలను తీసుకుందని అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించేందుకు సమంత ఓకే చెప్పింది.

  • Samantha Next Movie With BellamKonda Srinivas-Bellamkonda Srinivas Samantha

    Samantha Next Movie With BellamKonda Srinivas

  • ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘సీత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సీత చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తోంది. సమ్మర్‌లో సీత చిత్రం విడుదల కాబోతుంది. సీత చిత్రం పూర్తి అయిన వెంటనే ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

  • Samantha Next Movie With BellamKonda Srinivas-Bellamkonda Srinivas Samantha
  • ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ సినిమా కోసం ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమంతకు ఏకంగా మూడు కోట్ల ఆఫర్‌ చేసి ఈ చిత్రంలో ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సమంత ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బేబి అనే చిత్రంలో కూడా సమంత నటిస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాత అల్లుడు శీనుతో మరోసారి రొమాన్స్‌ చేయబోతుంది.