సమంత న్యూ ఇయర్‌ వేడుకలు

హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా కూడా సమంత స్నేహితుల పెళ్లిలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల్లో తప్పకుండా హాజరవుతూ వస్తుంది.ముఖ్యమైన రోజుల్లో ఈమె తప్పకుండా షూటింగ్‌లను పక్కన పెట్టి పాల్గొంటుంది.

 Samantha New Year Celebrations In Goa-TeluguStop.com

ఇదే క్రమంలో ఈమె న్యూ ఇయర్‌ వేడుకలను కూడా గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది.ఈ సారి న్యూ ఇయర్‌ వేడుకలను గోవాలో ప్లాన్‌ చేసుకుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం ఈమె కొద్దిమంది స్నేహితులతో ఈమె గోవాలో తెగ ఎంజాయ్‌ చేస్తోంది.

గోవాలో స్కూటీతో రోడ్లపై తిరుగుతూ, బీచ్‌లో స్నేహితులతో ఆడుతూ, పాడుతూ ఎంజాయ్‌ చేస్తోంది.

ఈమెతో పాటు ఈమె వ్యక్తిగత స్టైలిష్ట్‌ మరియు స్నేహితురాలైన నీరజాకోన కూడా ఉన్నారు.వీరు కలిసి తిరుగుతూ, ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలను నీరజ కోన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది.

ప్రస్తుతం సమంత తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఇక తమిళంలో కూడా పలు చిత్రాల్లో ఈమె నటించేందుకు కమిట్‌ అయ్యింది.2014 సంవత్సరం తనకు మంచి అనుభూతిని మిగిల్చిందని సమంత సంతోషంగా ఉంది.2015లో కూడా సమంత స్టార్‌ హీరోయిన్‌గా నిలుస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube