సమంత సమ్మర్‌ సందడి కన్ఫర్మ్‌ అయ్యింది

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత బాలీవుడ్‌ కు వెళ్తోంది.ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సమంత అక్కడ మరిన్ని సినిమా లు చేస్తుందని అంతా అనుకున్నారు.

 Samantha New Film Yashoda Shooting Update , Samantha, Yashoda, Shakunthalam, Bol-TeluguStop.com

కాని సౌత్‌ లో కూడా వరుసగా సినిమా లను కమిట్ అవుతుంది.తాజాగా ఈ అమ్మడు ఒక సౌత్ లో యశోద అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా మెల్ల గా వస్తుందని అంతా అనుకున్నారు.కాని యశోద సినిమా శర వేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో తమిళ స్టార్‌ హీరోయిన్‌ కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఒక మల్టీ స్టారర్ గా ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందో చూడాలి.

Telugu Bollywood, Samantha, Shakunthalam, Yashoda-Movie

తాజాగా రెండవ షెడ్యూల్‌ మొదలు అయిన ఈ సినిమా ను సమ్మర్ లో విడుదల చేస్తామని అంటున్నారు.సమ్మర్ లో ఈ సినిమా ను విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.సమంత ఇప్పటికే శాకుంతలం సినిమా ను పూర్తి చేసింది.

ఆ సినిమా ను కూడా వచ్చే సమ్మర్ లో విడుదల చేస్తారని అంటున్నారు.సమంత సినిమా లు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

యశోద సినిమా లో సమంత కాస్త బోల్డ్‌ గా కనిపించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.ఆ సినిమా విషయమై వస్తున్న వార్తల్లో  నిజం ఎంత అనేది ఫస్ట్‌ లుక్‌ లుక్ వస్తే కాని క్లారిటీ రాదు.

సమంత మరియు తమిళ స్టార్‌ నటుడు కలిసి నటించిన ఒక సినిమా కూడా తమిళంలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.తెలుగు లో ఈ సినిమా డబ్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube