సమంత వచ్చే ఏడాది ముచ్చటగా మూడు

తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ను వివాహం చేసుకున్న సమంత గత కొన్నాళ్లుగా సినిమాల సంఖ్య భారీగా తగ్గించింది.పెళ్లికి ముందు ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేసిన సమంత ఇప్పుడు మాత్రం చాలా తక్కువ సినిమాలు చేస్తుంది.

 Next Year Samantha Doing In Three Movies, Samantha, Nandini Reddy, Vikram K Kuma-TeluguStop.com

ఈ ఏడాది ఈమె అసలు సినిమాలే చేయడం లేదు.ప్రస్తుతం ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఈమె చేతిలో సినిమాలు లేవు.

నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకు ఈమె ఒకే చెప్పిందని వార్తలు అయితే వచ్చాయి.కాలం ఇప్పటి వరకు ఆ విషయం పై అధికారిక ప్రకటన రాలేదు.

కానీ నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా ఖచ్చితంగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు.ఇదే సమయంలో తమిళంలో నయనతార తో కలిసి విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నది.

Telugu Nagachaitanya, Nandini Reddy, Samantha, Telugu Tamilam, Tollywood, Vignes

విజ్ఞేష్ శివన్ సినిమాకు గాను సమంత పారితోషికం కూడా తగ్గించుకునేందుకు ఒప్పుకుంది.ఆ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.మరో వైపు విక్రమ్ కుమార్ కూడా సమంతను తన సినిమాలో నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.నాగ చైతన్య ఇంకా సమంతలతో విక్రమ్ సినిమా ఉండే అవకాశం ఉంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలో సమంత మూడు సినిమాలు విడుదల అవ్వడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube