పాపం చైతూ కోసం సమంత ఎంత కష్టపడుతుందో..!

ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య మరియు సమంత చాలా అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్న విషయం తెల్సిందే.వారు ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని లీడ్‌ చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉంటున్నారు.

 Samantha Akkineni Learning A Coocking For Nagachaitanya, Nagachaitanya, Samantha-TeluguStop.com

ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంతలు హైదరాబాద్‌లోని ఒక ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు.ఇన్నాళ్లు షూటింగ్స్‌తో ఇద్దరు బిజీ బిజీగా ఉండటంతో ఎక్కువ శాతం బయట తింటూ ఉండేవారు.

కాని ఇప్పుడు మాత్రం ఇద్దరు ఇంట్లోనే ఉంటున్న కారణంగా సొంతంగా వంట చేసుకుంటున్నారు.

Telugu Kollywood, Nagachaitanya, Roofgarden, Samantha, Tamila Web, Tollywood-Mov

బయట వంటలు తినే పరిస్థితి లేని కారణంగా సమంత స్వయంగా రూఫ్‌ గార్డెన్‌ పెట్టి కూరగాయలు పండిస్తూ ఉంది.ఇదే సమయంలో వంట కూడా నేర్చేసుకోవాలని సమంత ఫిక్స్‌ అయ్యింది.అందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రైనర్‌ను కూడా సమంత పెట్టుకుంది.

తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను సమంత పోస్ట్‌ చేసింది.నాగచైతన్య కోసం సమంత ఏకంగా వంట నేర్చుకుంటున్న విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Telugu Kollywood, Nagachaitanya, Roofgarden, Samantha, Tamila Web, Tollywood-Mov

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో కూడా సత్తా చాటిన ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం సినిమాకు కాస్త దూరంగా ఉంటుంది.ఈ ఏడాది కాంలో సమంత ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.ఒక తమిళ వెబ్‌ సిరీస్‌లో మినహా ఈమె మరే సినిమాలో కూడా నటించిన దాఖలాలు లేవు.వచ్చే ఏడాదిలో ఒక సినిమా చేయబోతుంది.గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు అయితే చేయడం లేదు.కనుక చైతూ కోసం వంట నేర్చుకుని ఆయనకు వండి వార్చాలని ఆశపడుతుందట.

అందుకే ఇలా వంట నేర్చుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube