సమంతను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైతూ డైరెక్టర్‌  

Samantha Naga Chaitanya Vikram Kumar - Telugu Love Story, Naga Chaitanya, Naga Chaitanya Again With Samantha, Samantha, Vikram Kumar

నాగచైతన్య హీరోగా రూపొందుతున్న శేఖర్‌ కమ్ముల ‘లవ్‌ స్టోరీ’ చిత్రం దాదాపుగా పూర్తి అయ్యింది.ఆ సినిమాను త్వరలోనే పూర్తి చేసి నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Samantha Naga Chaitanya Vikram Kumar

ఇప్పటికే విక్రమ్‌ కుమార్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశాడు అనే ప్రచారం జరుగుతోంది.ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

వీరిద్దరి కాంబోలో మనం తర్వాత వస్తున్న చిత్రం ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

సమంతను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైతూ డైరెక్టర్‌-Movie-Telugu Tollywood Photo Image

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మనం వంటి మరో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు విక్రమ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

నాగచైతన్యకు జోడీగా సమంతను ఎంపిక చేస్తే సినిమాకు డబుల్‌ క్రేజ్‌ వస్తుందని విక్రమ్‌ భావిస్తున్నాడు.మనం సినిమాలో ఇద్దరు కలిసి నటించి ఆకట్టుకున్నారు.అందుకే వారిద్దరిని కూడా ఈ సినిమాలో నటింపజేస్తే ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుందనే నమ్మకంను విక్రమ్‌ కలిగి ఉన్నాడు.

మనం చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలతో తెలుగులో విక్రమ్‌ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.అందుకే ఈ చిత్రంతో కూడా మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడని అంటున్నారు.కాని సమంతను ఒప్పించేందుకు మాత్రం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

సమంత ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకు వెళ్లాలని కూడా విక్రమ్‌ భావిస్తున్నాడట.మరి ఈ సమయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Naga Chaitanya Vikram Kumar Related Telugu News,Photos/Pics,Images..

footer-test