విడాకులు ఫిక్స్.. సమంతకు భరణంగా రూ.300 కోట్లు?

తెలుగు చిత్ర పరిశ్రమలోలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు గడించిన చై-సామ్ గురించి గత కొంత కాలంగా విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ ప్రచారంపై అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్యగానీ ఎలాంటి విషయాన్ని చెప్పలేదు.

 Samantha Naga Chaitanya Divorce Confirmed Samantha To Get Rs 300 Crore As Alimony Arrears-TeluguStop.com

కానీ సమంత మాత్రం రోజుకో రకమైన ట్వీట్‌తో అభిమానులను కన్ఫ్యూజన్‌లో పెడుతున్నారు.అక్కినేని కుటుంబం కూడా ఈ విషయంపై స్పందించలేదు.

 అయితే అసలు ఏమి జరుగుతోంది? చై-సామ్ నిజంగానే విడిపోబోతున్నారా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం ఏంటీ అనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Samantha Naga Chaitanya Divorce Confirmed Samantha To Get Rs 300 Crore As Alimony Arrears-విడాకులు ఫిక్స్.. సమంతకు భరణంగా రూ.300 కోట్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Divorce, Lovestory, Majili, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

వీరి విహహమై సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కావస్తోంది.కానీ వీరి మధ్య మునుపెన్నడూ కూడా మనస్పర్థలు వచ్చిన దాఖలాల్లేవు.పెళ్లి తర్వాతే వారిద్దరికీ మంచి అవకాశాలు కూడా వచ్చాయి.

ఇద్దరూ కలిసి మజిలీ సినిమాలో నటించి అభిమానుల మదిని దోచుకున్నారు.ఇలా సవ్యంగా జరిగిపోతూ ఉన్న సమయంలోనే సామ్, చై విడాకులు తీసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలు ట్రెండింగ్‌గా మారాయి.

ఈ వార్తలు సోషల్ మీడియాలు వచ్చిన ప్రారంభంలో అందరూ ఓ తప్పుడు ప్రచారమనే అనుకున్నారు.కానీ సమంత తన ట్విట్టర్ అకౌంట్ నుండి అక్కినేని ఇంటి పేరుని తొలగించడంతో అందరిలోనూ కొంత అనుమానం రేకెత్తింది.

ఆ తర్వాత సామ్ తన ట్విట్టర్ అకౌంట్ కి “s” అక్షరాన్ని మాత్రమే పేరుగా ఉంచుకోవడంతో వారిద్దరూ విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్టైంది.అప్పుడైనా వాళ్లల్లో ఒక్కరైనా ఈ విషయంపై క్లారిటీ ఇస్తారమోనని భావించి.

మీడియానే సామ్ ముందుకు ఈ ప్రశ్నను లేవనెత్తింది.అప్పుడు కూడా అమ్మడు “బుద్ధి ఉందా ” అంటూ మీడియా మీద కోప్పడిందే గాని.

అసలు ఏం జరుగుతుందనే దాన్ని పూర్తిగా చెప్పలేదు.

మరోపక్క సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరి మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.

ఆ ప్రమోషన్స్‌లో కూడా సమంత ఎక్కడా కనిపించడం లేదు.చైతూ కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంటూ వస్తున్నాడు.

భార్యభర్తల మధ్య గ్యాప్ రావడం నిజమే అని అటు ఇండస్ట్రీ వర్గాలు, మీడియా మరియు సాధారణ ప్రేక్షకులు ఇలా అందరూ ఫిక్స్ అయిపోయినప్పటికీ ఇంత కాలం బాగానే ఉన్న జంట మధ్య అసలు గొడవలేంటీ ? అసలు అది ఎక్కడ మొదలైంది? అని అందరి మదిలోనూ మెదుతున్న ప్రశ్నలే.

Telugu Divorce, Lovestory, Majili, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

తాజా సమాచారం ప్రకారం, సమంత-నాగ చైతన్య డైవర్స్‌పై వీరిద్దరికి ఫ్యామిలీ కోర్టులో పలుమార్లు కౌన్సిలింగ్ జరిగినట్టు తెలుస్తోంది.కౌన్సిలింగ్ తరువాత కూడా సామ్, చై నిర్ణయంలో మార్పు రాకపోవడంతో విడాకులు ఖాయమని ప్రజలు భావిస్తున్నారు.మరో రెండు, మూడు నెలల్లో ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది.

అయితే ఈ విడాకులకు గాను సమంతాకి స్థిర, చర ఆస్తులతో కలిపి మొత్తం 250 నుండి 300 కోట్ల రూపాయల వరకు భరణంగా అందబోతుందని సమాచారం.మరి ఈ విషయంలో కూడా ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

ఏదిఏమైనప్పటికీ సమంత చైతన్య విడాకులు తీసుకొని విడిపోతున్నారనే విషయం అభిమానలకు మింగుడుపడలేదని చెప్పవచ్చు.

#Lovestory #Majili #Divorce #Naga Chaitanya #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు