Samantha Health Update : ట్రీట్మెంట్ మార్చేసిన సమంత.. ఆరోగ్యం కోసం ఆయుర్వేదాన్ని నమ్మిన స్టార్ హీరోయిన్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

 Samantha Has Opted For Ayurveda Treatment For Myositis,samantha,ayurveda Treatme-TeluguStop.com

గత కొద్ది రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.అయితే ఇదే విషయంపై సమంత కొద్ది రోజులపాటు విదేశాలలో ఉండడంతో ఆమె ఆరోగ్యం పట్ల అనేక రకాలుగా వార్తలు వినిపించాయి.

తనకి ఆ వార్తలన్ని అవాస్తవాలని తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత తెలిపింది.ఆమె హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమె నటించిన యశోద సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

అయితే హాస్పిటల్లో సెలైన్స్ ఎక్కించుకుంటూనే ఆమె యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది.అయితే సమంత మయోసైటిస్ వ్యాధిలో థర్డ్ స్టేజ్ లో ఉన్నట్లు ఇటీవల నటి కల్పికా గణేష్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఇటీవలే సమంత కండిషన్ క్రిటికల్ కావడంతో ఆమెను ఇమీడియట్ గా హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు వార్తలు వినిపించాయి.వార్తలపై సమంత మేనేజర్ స్పందిస్తూ ఆ వార్తలు నిజం లేదు సమంత గారికి ఏమీ అవ్వలేదు ఆమె క్షేమంగా ఇంట్లోనే ఉన్నారు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటూ ఇలా గాలి వార్తలు ప్రచారం చేయవద్దు అని తెలిపాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ఆరోగ్యానికి సంబంధించిన మరొక మరొక వార్త వినిపిస్తోంది.

Telugu Ayurveda, English, Kalpika Ganesh, Myositis, Samantha, Tollywood, Yashoda

అదేమిటంటే సమంత ఇంగ్లీష్ మెడిసిన్స్ ను మానేసి ట్రీట్మెంట్ ను పూర్తిగా మార్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అనగా సమంత ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం చేయించుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం ఆమె హైదరాబాదులో ఉండే లోకల్ ఆయుర్వేదిక్ డాక్టర్ ను సంప్రదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే సమంత స్పందించి అంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube