శిల్పా శెట్టి బాటలో సమంత.. కొలిక్కి రానున్న విడాకుల వివాదం?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య గురించి హాట్ టాపిక్ గా మారింది.వీరి గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి.

 Samantha Moving To Court Amid Divorce Rumors-TeluguStop.com

దీనంతటికి కారణం సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో అక్కినేని అని పేరు తొలగించడమే ఇన్ని పరిణామాలకు దారి తీసింది.అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వీటి గురించి సమంత కానీ నాగచైతన్య గాని స్పందించలేదు.ఒక వైపు సమంత తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లగా నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

 Samantha Moving To Court Amid Divorce Rumors-శిల్పా శెట్టి బాటలో సమంత.. కొలిక్కి రానున్న విడాకుల వివాదం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే పలు దైవదర్శనాలకి వెళ్లిన సమంతముందుకు మీడియా విడాకుల ప్రశ్నలు తీసుకురాగా వారిపై నీకు బుద్ధుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో ఎక్కడ కూడా మీడియా నాగచైతన్యను ఈ ప్రశ్న అడగడానికి సాహసించలేదు.

అయితే ఇప్పటికీ వీరి గురించి వస్తున్న అనేక కథనాలపై వీరు స్పందించకపోవడంతో వీరికి విడాకులు ఫిక్స్ అయ్యాయని సమంతకు భరణంగా 50 కోట్లను నాగచైతన్య ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Telugu Divorce, Naga Chaitanya, Samantha, Shilpa Shetty-Movie

ఈ విధంగా సమంత నాగచైతన్య గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ విషయం గురించి స్పందించకపోతే ఇంకా వీరి గురించి దిగజారుడు వార్తలు రాస్తారని సమంత బాలీవుడ్ నటి శిల్పాశెట్టి బాటలోనే ఈ విషయం పై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.తన పరువుకు భంగం కలిగేలా తన గురించి కానీ తన భర్త నాగచైతన్య గురించి గాని ఇలాంటి వార్తలు రాయకుండా ఉండడం కోసం ఆమె కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన భర్త పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు కావడంతో ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించి తన పేరును ఎక్కడ వాడకూడదని కోర్టును విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సమంత కూడా ఇదే బాటలో కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

#Samantha #Shilpa Shetty #Naga Chaitanya #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు