సమంత లవ్‌ ఫెయిల్యూర్‌?

టైటిల్‌ చూసి ఆశ్చర్యపోతున్నారా.నిజ జీవితంలో కాదు లేండి సినిమాకు సంబంధించి సమంత లవ్‌ ఫెయిల్యూర్‌ కాబోతుంది.

 Samantha, Naga Chaitanya, Director, Nandini Reddy, Oh Baby, Script Work, Shootin-TeluguStop.com

ప్రస్తుతం హీరోయిన్‌గా నందిని రెడ్డి ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఆ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోతుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.ఎంతో ఆరాధించి ప్రేమించిన వ్యక్తి మోసం చేసి పోవడంతో హీరోయిన్‌ సమంత పడే మానసిక వేదన మరియు ఆమె పడే సంఘర్షణను సినిమాలో చూపించబోతున్నారు.

ఓ బేబీ సినిమాలో విభిన్నమైన పాత్రను పోషించి మెప్పించిన సమంత ఈసారి అంతకు మించిన విలక్షణ పాత్రను పోషించబోతుంది.ప్రస్తుతం సమంత చాలా తక్కువ సినిమాలు చేస్తోంది.

ఆ సినిమాలు కూడా ఎక్కువగా కమర్షియల్‌ పాత్రలు కాకుండా లేడీ ఓరియంటెడ్‌ పాత్రలు మాత్రమే అంటూ పేర్కొంది.సమంత చేస్తున్న పాత్రలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Telugu Love Failure, Naga Chaitanya, Nandini Reddy, Baby, Samantha, Script-

ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా చేయలేక పోయిన సమంత వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలు అయినా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో సమంత స్క్రిప్ట్‌ వింటోంది.మరో వైపు నాగచైతన్యతో కూడా ఒక సినిమాను సమంత చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇంకా ఆ సినిమా అధికారిక ప్రకటన రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube