బాలయ్య అన్ స్టాపబుల్ షోకు అక్కినేని మాజీ కోడలు.. నాగచైతన్య పరువు తీస్తుందా?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒక నటుడుగా ఎంత పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Samantha Likely To Participate In The First Episode Of Balakrishna Unstoppable W-TeluguStop.com

ఈయనకు తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఉంది.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన స్టార్ హీరోగా ఎదిగాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.యంగ్ హీరోలతో పోటీ గా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.ఒక సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు బాలయ్య.ఇటీవలే అఖండ సినిమాతో కెరీర్ పరంగా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

 Samantha Likely To Participate In The First Episode Of Balakrishna Unstoppable W-TeluguStop.com

అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.ఇక బాలయ్య వ్యాఖ్యాతగా కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాడు.తెలుగు ఓటీటీ వేదికగా ఆహా లో ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’ అనే షో లో హోస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇందులో సెలబ్రెటీలను ఆహ్వానించి తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నాడు బాలయ్య.

ఇక ఇప్పటికే ఇందులో చాలా మంది సినీ ప్రముఖులు, నటీనటులు పాల్గొన్నారు.తనకి సీజన్ వన్ బాగానే సాగింది.

ఇదిలా ఉంటే సీజన్ 2 నెల చివరి వారంలో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Telugu Akkineni, Balakrishna, Balayyas, Naga Chaitanya, Samantha-Movie

ఈ విషయాన్ని ఆహా ఇటీవల ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.ఇక ఈసారి సీజన్ 2 ను సమంతతో స్టార్ట్ చేస్తారు అని టాక్ వస్తుంది.ఇక సమంత బాలయ్య షోలో పాల్గొన్నట్లయితే.అందులో కచ్చితంగా తన విడాకుల గురించి, తను చేస్తున్న హాట్ పాత్రల గురించి ప్రశ్నలు ఎదురవుతాయి అని తెలుస్తుంది.

ఒకవేళ నిజంగా సమంత ఈ షోలో పాల్గొన్నట్లయితే.కచ్చితంగా తను నాగచైతన్య పరువు తీస్తుందేమో అని అనుకుంటున్నారు నెటిజన్స్.

గతంలో సమంత కరణ్ జోహార్ షో లో పాల్గొని నాగచైతన్య గురించి తను చేసిన కామెంట్లు ఎలా ఉన్నాయో చూసాం.మరి ఈ తెలుగు షోలో తను నాగచైతన్య గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి.

Telugu Akkineni, Balakrishna, Balayyas, Naga Chaitanya, Samantha-Movie

ఇక బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య.ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించనున్నాడు.అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరో సినిమాకు సైన్ చేశాడు.ఇక ఈ సినిమా పక్కా మాస్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కనుంది.

ఇక వెంకీ అట్లూరి, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా వరుస సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇటీవలే డైరెక్టర్ సి.కళ్యాణ్ కూడా బాలయ్యకు కథ వినిపించాడని తెలిసింది.డైరెక్టర్ రాజ్ కందుకూరి దృష్టి కూడా బాలయ్య పై పడిందని తెలుస్తోంది.

మొత్తానికి బాలయ్య యంగ్ హీరోల కంటే రెట్టింపు తో దూసుకుపోతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube