నేను తింటాను కనుకే మిమ్ముల్ని తినమంటున్నా : సమంత  

Samantha Kurkure Add Got Trolled-sam About Kurkure,samantha,sunday Snacks

టాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమద్య కాలంలో బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరించే స్టార్స్‌ సంఖ్య బాగా పెరిగింది. బాలీవుడ్‌ స్టార్స్‌ ఎప్పటి నుండో ఈ పని చేస్తున్నా కొందరు టాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం ఈమద్య కాలంలో ప్రమోటింగ్‌ పనులు నెత్తిన వేసుకుంటున్నారు..

నేను తింటాను కనుకే మిమ్ముల్ని తినమంటున్నా : సమంత-Samantha Kurkure Add Got Trolled

తాజాగా సమంత ప్రముఖ స్నాక్స్‌ కంపెనీ అయిన కుర్‌కురేకు ప్రమోటర్‌గా ఎంపిక అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా సమంత సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. కుర్‌కురేకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక అయినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

సమంత కుర్‌కురేకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. కొంత కాలం నుండి కుర్‌కురే అనేది పిల్లలకు అనారోగ్యంను కలిగిస్తుంది, అందులో ప్లాస్టిక్‌ ఉంది అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రచారం చేయడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నించారు.

మరి కొందరు ప్రచారం అయితే చేస్తున్నారు కాని ఒక్క ప్యాకెట్‌ పూర్తిగా మీరు కుర్‌కురేను తింటారా, మీరు డైట్‌ అంటూ ఏమీ తినకుండా ఉంటారు పబ్లిసిటీ, ప్రచారం మాత్రం కుర్‌కురేకు చేస్తారా అంటూ కొందరు ప్రశ్నించిన నేపథ్యంలో సమంత సమాధానం ఇచ్చింది.

సమంత తాజాగా ఆ విషయమై మాట్లాడుతూ నేను కుర్‌కురేను ఇష్టంగా తింటాను. నేను డైట్‌ ఫాలో అయ్యే మాట వాస్తవమే. కాని నేను ఆదివారం తినే స్నాక్స్‌లో ఖచ్చితంగా కుర్‌కురే ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది.

కావాలంటే మీకు ఆదివారం స్నాక్స్‌కు సంబంధించిన ఫొటోను పంపిస్తాను అంటూ నెటిజన్స్‌కు సమాధానం ఇచ్చింది. నేను తింటాను కనుకే ప్రమోట్‌ చేస్తున్నాను. నేను తినేది కనుకే మిమ్ములను తినమంటున్నాను అంటూ సమంత కుర్‌కురే బాధ్యతను మరింత నెత్తిన వేసుకుని మాట్లాడింది..