సమంత కెమెరా ముందుకు వచ్చేది అప్పుడేనా?  

Samantha Family man Webseries Sequel, Samantha Not to attend shootings, Corona Effect, Dasara - Telugu Corona Effect, Dasara, Samantha Family Man Webseries Sequel, Samantha Not To Attend Shootings

సమంత పెళ్లి చేసుకున్నప్పటి నుండి సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది.మునుపటి జోరు అయితే కనిపించడం లేదు.

TeluguStop.com - Samantha Joins Shooting After Dasara

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కమర్షియల్‌ పాత్రల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది.ఇది మంచిదే కాని ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అవ్వడం మాత్రం అభిమానులు జీర్ణించుకోవడం లేదు.

TeluguStop.com - సమంత కెమెరా ముందుకు వచ్చేది అప్పుడేనా-Movie-Telugu Tollywood Photo Image

మంచి పాత్రలను చేసి అక్కినేని వారి గౌరవంను పెంచాలని అక్కినేని ఫ్యాన్స్‌ కూడా కోరుకుంటున్నారు.ఈ సమయంలో సమంత ఒక్కటి అంటే కనీసం ఒక్క సినిమా కూడా చేయడం లేదు.

ఈ ఏడాది ఆరంభంలో జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కాని కెమెరా ముందుకు మాత్రం ఈ ఏడాదిలో ఒక్కసారి అంటే కనీసం ఒక్కసారి కూడా రాలేదు.

కారణం ఈ ఏడాదిలో ఆమె కొత్త సినిమాలకు కమిట్‌ కాలేదు.ఈ సమ్మర్‌లో ఆమె సినిమా ఏదైనా ప్రారంభం అయ్యేదేమో.కాని కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం స్థంభించి పోయింది.ఈ సమయంలో సమంత కూడా సినిమాలకు కమిట్‌ అవ్వడం పక్కన పెట్టి కనీసం బయటకు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని ఆమె సన్నిహితులు మరియు స్నేహితులు చెబుతున్నారు.

సమంత గత ఏడాది ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌ లో నటించేందుకు ఓకే చెప్పింది.కొన్ని రోజులు షూటింగ్‌ కూడా చేసింది.ఇప్పుడు ఆ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ మొదలు పెట్టాలని మేకర్స్‌ భావిస్తుంటే సమంత మాత్రం దసరా వరకు షూటింగ్స్‌కు హాజరు కాలేము అంటూ తేల్చి చెప్పిందట.దసరా తర్వాత పరిస్థితిని బట్టి ఆ తర్వాత ఆలోచిస్తాను అంటూ చెప్పినట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు.

ఇక ఒక తమిళ సినిమా చర్చల దశలో ఉంది.ఆ సినిమాను వచ్చే ఏడాదిలో ఈమె చేయాలని భావిస్తుందట.

#SamanthaNot #Corona Effect #SamanthaFamily #Dasara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Joins Shooting After Dasara Related Telugu News,Photos/Pics,Images..