సమంతను అతనెందుకు బయపెడుతున్నాడు.. అసలు ఆ వ్యక్తి ఎవరు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ సమంత.తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది.

 Samantha Is Scared Of Him Who Is That Person-TeluguStop.com

తన అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.

ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తనను ఓ వ్యక్తి భయపెడుతున్నట్లు తెలుస్తుంది.

 Samantha Is Scared Of Him Who Is That Person-సమంతను అతనెందుకు బయపెడుతున్నాడు.. అసలు ఆ వ్యక్తి ఎవరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.

ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సమంత నేల మీదనే గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.

అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.

Telugu Film Industry, Heroine, Samantha, Scared, That Person, Tollywood-Movie

గత కొన్ని రోజుల నుండి సమంత, నాగ చైతన్య ల మధ్య దూరం పెరిగిందని విడాకులు తీసుకుంటున్నారని గాసిప్స్ రావడంతో ఇటీవలే తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.

ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.

ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది.

అంతేకాకుండా ఓ వీడియో కూడా షేర్ చేసి ఓ వ్యక్తి గురించి పోస్ట్ చేసింది.తాను ఆ వీడియోలో 30 కిలోల డంబెల్ ను పట్టుకొని వర్కౌట్ చేయగా ఆ వీడియో షేర్ చేస్తూ.

స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవరు ఇచ్చారు.నువ్వు లేకపోయినా భయమేస్తుంది.

సాధారణంగానే 30 కిలోల డంబెల్ ను మోస్తున్నాను అంటూ తన ట్రైనర్ స్నేహ దేసు గురించి పొగిడింది.

Telugu Film Industry, Heroine, Samantha, Scared, That Person, Tollywood-Movie

ఇక ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులలో అవకాశాలలో అందుకుంటుంది.ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పై రెండు సినిమాలకు ఓకే చేసింది.

ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది సమంత.

#Samantha #Scared #Person

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube