తల్లి కాబోతున్న సమంత.. కానీ?

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని నటన గురించి, తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో పెళ్ళి తర్వాత మరి ట్రెండ్ ని ఫాలో అవుతుంది.

 Is Samantha Becoming A Mother, Samantha, Tollywood, Pregnancy, Naga Chaithanya,-TeluguStop.com

నిత్యం ఫోటో షూట్ లంటూ బాగా బిజీ గా మారింది.ఇక సినిమా విషయంలో కూడా వరుస ఆఫర్లు అందుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ అక్కినేని కోడలు.

వెండి తెరపై కాకుండా బుల్లితెరలో కూడా తనేంటో నిరూపించుకుంది సమంత.

ఇప్పటివరకు ఎన్నో యాడ్స్ లను చేసింది.ఇక తన భర్త నాగచైతన్య తో కలిసి కూడా పలు యాడ్స్ లలో చేసింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన పెళ్లి అయినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో సార్లు ఓ ప్రశ్న ఎదుర్కొంది.సమంత ప్రెగ్నెంట్ అని, అక్కినేని ఇంటికి వారసుడు వస్తున్నాడని ఎన్నో పుకార్లు కూడా వచ్చాయి.

ఇక వాటి గురించి స్పందించిన సమంత తమ వ్యక్తిగత విషయాలలో అంత శ్రద్ధ ఎందుకు అని అసహనం వ్యక్తం చేసింది.ఇదిలా ఉంటే మళ్లీ ఈ బ్యూటీ తల్లి కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సమంత ఒక మామిడి కాయను చూస్తున్నట్లుగా అనిపించింది.

Telugu Naga Chaithanya, Pregnancy, Samantha, Samantha Mother, Samathalatest, Tol

అంతేకాకుండా అందులో సమంత కాస్త చెబ్బి గా కూడా కనిపించింది.దీంతో ఈ పిక్ ని చూసిన నెటిజనులు సమంత తల్లి కాబోతుందా అని తెగ ప్రశ్నిస్తున్నారు.పైగా అక్కడ మామిడి కాయ ఉండటంతో అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి.

Telugu Naga Chaithanya, Pregnancy, Samantha, Samantha Mother, Samathalatest, Tol

ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో అందరి నోట నుండి ఇదే మాట వినిపిస్తోంది.

కానీ నిజానికి సమంత ఈ ఫోటోను సాకీ డిజైన్ దుస్తులను ప్రమోట్ చేసేందుకు అలా ఫోటో షూట్ లలో పాల్గొన్నదని తెలుస్తుంది.తన సొంత డిజైనింగ్ కంపెనీ తయారుచేసిన డ్రెస్ ధరించి ఫోటోకు స్టిల్ ఇచ్చింది సమంత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube