ఆ టీవీ ఛానెల్ పై సమంత ఆగ్రహం.. మరో అవకాశం ఉండదంటూ?

సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారని అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత ఎంతో మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఎంతో అన్యోన్యంగా సాగిపోయే వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మనస్పర్ధలు రావడం చేత వివాహ బంధానికి ముగింపు పలికారనే విషయం గురించి నెటిజన్లు పెద్దఎత్తున ఆరా తీశారు.

 Samantha Is Angry With That Tv Channel Thet Is No Another Chance, Samantha, Hero-TeluguStop.com

ఈ క్రమంలోని ఎవరికి తోచిన రీతిలో వారు సమంత నాగ చైతన్యల విడాకుల గురించి మాట్లాడారు.ఈ క్రమంలోనే ఓ మీడియా సమంతను టార్గెట్ చేస్తూ ఈ విషయాలన్నింటినీ ఎంతో హైలెట్ చేసి చూపించింది.

ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ఈ విధమైన రూమర్లకు చెక్ పెట్టడం కోసం సమంత ఈ విషయం పై ఘాటుగా స్పందించిన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు.నేను అబార్షన్ చేయించుకున్నానని, పిల్లలంటే ఇష్టం లేదని ఎందరో ఎన్నో రకాలుగా తనను బాధపెట్టారని తెలియజేసింది.

ఇకపోతే తన గురించి లేనిపోని కథనాలను సృష్టించి హైలెట్ చేసిన మీడియా మధ్యవర్తుల ద్వారా తనతో ఇంటర్వ్యూ చేయాలని భావించింది.

ఈ క్రమంలోనే సమంత స్పందిస్తూ ఈ టీవీ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తను ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూలను ఇవ్వడానికి సిద్ధంగా లేనని తెలియజేశారు.

ఇదిలా ఉండగా సమంత తన డిజైనర్ ప్రీతమ్ మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందంటూ సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ తెలియజేశారు.అదేవిధంగా ప్రీతమ్ నేడు ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా సమంతకు తనతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నాగచైతన్యకు కూడా తెలుసని నేడు ప్రీతమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

ఇక విడాకులు అనంతరం సమంత తన జ్ఞాపకాలు అన్నింటిని మర్చిపోవడం కోసం సినిమాలతో బిజీకానుంది.ఇప్పటికే మూడు సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube