సమంతపై నాగచైతన్య ఫైర్.. అసలేమైందంటే..?

సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించి రీల్ జోడీగా విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు రియల్ లైఫ్ లో కూడా జోడీగా మారి గుర్తింపును సంపాదించుకున్నారు చైతన్య సమంత.చైతన్య సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఈ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉంది.

 Samantha Irritates Pet Hash And Nagachaitanya-TeluguStop.com

పెళ్లి తరువాత చైతన్యకు కథల ఎంపికలో సమంత సహాయం చేస్తున్నారని సమాచారం.

అయితే తాజాగా నాగచైతన్య సమంతపై ఫైర్ అయ్యారు.

 Samantha Irritates Pet Hash And Nagachaitanya-సమంతపై నాగచైతన్య ఫైర్.. అసలేమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెంపుడు కుక్క హష్ అంటే సమంత, చైతన్యలకు ఇష్టమనే సంగతి తెలిసిందే.సమంత సోషల్ మీడియాలో, హోస్ట్ చేసే టాక్ షోలలో కూడా కూడా హష్ గురించి చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా షేర్ చేసిన వీడియోలో హష్ చైతన్యపై పడుకుని ఉంటే సమంత కదిలించారు.సమంత అలా చేయడంతో ఇరిటేట్ చేయవద్దంటూ చైతన్య సమంతపై ఫైర్ అయ్యారు.

చైతన్య సమంతపై ఫైర్ కాగా సమంత మాత్రం చైతన్యను వెక్కిరించారు.ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.పెంపుడు జంతువులను ఇష్టపడే సమంత హష్ పై తన ప్రేమను చాల సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.మరోవైపు చైతన్య, సమంత సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది.ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమాపై ప్రేక్షకుల్లోబాగానే అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా చైతన్య, సమంత కెరీర్ లో పెద్ద హిట్ గా నిలుస్తుందని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.చైతన్య ఈ సినిమాతో పాటు థ్యాంక్యూ సినిమాలో నటిస్తుండగా సమంత శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్నారు.2022లో శాకుంతలం సినిమా రిలీజ్ కానుండగా గుణశేఖర్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

#Samantha #Thank You Movie #Nagachaitanya #Shakuntalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు