ఇంట్రెస్టింగ్‌.. పవన్ కళ్యాణ్ సినిమా కోసం సమంత తో సంప్రదింపులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమా లకు కమిట్ అయిన విషయం తెలిసిందే.ఆ సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా షూటింగ్ ప్రారంభం కాబోతున్నాయి.

 Samantha In Pawan Kalyan Upcoming Movie ,   Pawan Kalyan , Social Media , Samant-TeluguStop.com

పవన్ కళ్యాణ్ నటించబోతున్న ఒక సినిమా కు గాను హీరోయిన్ పాత్ర లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.ఆమె ను ఇటీవలే పవన్ కళ్యాణ్ చిత్ర దర్శక నిర్మాతలు సంప్రదించారని, డేట్ల విషయం లో కాస్త సర్దుబాటు చేసేందుకు సమంత ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది.

సమంత ఇటీవలే మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధి నుండి బయట పడింది.ఆ వ్యాధి కారణంగా దాదాపు ఏడాది కాలం సినిమా లకు దూరంగా ఉంది.

వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోవాలని నిర్ణయించుకుంది.

Telugu Pawan Samantha, Pawan Kalyan, Samantha, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ తో గతం లోనే సమంత అత్తారింటికి దారేది సినిమా ను చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే పవన్ కళ్యాణ్ తో మళ్లీ సమంత నటించేందుకు గాను ఓకే చెప్పిందట.

అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ మరియు సమంత ల కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Pawan Samantha, Pawan Kalyan, Samantha, Tollywood-Movie

వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే అది కచ్చితంగా మళ్ళీ అత్తారింటికి దారేది సినిమా స్థాయి ఫలితాన్ని అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.సోషల్ మీడియా లో అత్తారింటికి దారేది సినిమా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.ఈ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.

పవన్ మరియు సమంత లు కలిసిన నటిస్తే చూడాలని అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కనుక ఈ వార్త వారికి జోష్ ను కలిగించడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube