హాలీవుడ్ ఎంట్రీ.. ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సామ్ దూరం!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరో సారి వార్తల్లో నిలిచింది.ఇటీవల ఈమె వరుసగా హాట్ ఫోటో షూట్లను నెట్టింట షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

 Samantha Hollywood Movie Arrangements Of Love Details, Arrangements Of Love, Sam-TeluguStop.com

మరో వైపు బాలీవుడ్ కోలీవుడ్ ఇతర వుడ్ ల లో హాట్ హాట్ సినిమా పాత్రల్లో నటించేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్లో ఈ అమ్మడు తాప్సి నిర్మాణంలో రూపొందబోతున్న సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.

తాజాగా మరో ఆసక్తికర ప్రకటనను సమంత చేసింది.ఆమె చెబుతున్న దాని ప్రకారం హాలీవుడ్లో రూపొందుతున్న అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో కనిపించబోతున్నదట.

ఈ సినిమాకు ఫిలిప్‌ జాన్ దర్శకత్వం వహించబోతున్నాడు.ఓ బేబీ సినిమా తో నిర్మాతగా మారిన సునీత తాటి ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు గా సమంత అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా తో పాటు సమంత పలు సినిమా ల్లో కూడా నటిస్తోంది.బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుందని అనుకున్న సమయంలో ఏకంగా హాలీవుడ్ జర్నీ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హాలీవుడ్ లో ఈమెను జనాలు ఎలా ఆదరిస్తారో అనేది చూడాలి.ఇంగ్లీష్ లో సమంత నటించబోతున్న మొదటి సినిమా ఇదే అవ్వడం వల్ల ఇండియన్ ప్రేక్షకుల్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్ ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

ఇక తాజా సినిమాల విషయానికొస్తే తెలుగు లో శాకుంతలం సినిమా చేసింది.

Telugu Love, Bollywood, Philip John, Nayanthara, Samantha, Shaakuthalama, Taapse

తమిళ్లో నయన తార తో కలిసి విఘ్నేష్‌ దర్శకత్వం లో ఒక సినిమా చేసింది ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.వచ్చే ఏడాది లో ఈ సినిమాలను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.ఈమె నటించబోతున్న మొదటి ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చే ఏడాది లోనే విడుదల కాబోతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి సమంత బిజీగా ఉంది.నాగచైతన్య కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత బిజీ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube