బంగార్రాజు కోసం చైతూ జోడీగా సమంత  

Samantha Heroine To Naga Chaitanya For Bangarraju Movie - Telugu Bangarraju Movie, Director Kalyan Krishna, King Nagarjuna, Samantha Heroine To Naga Chaitanya, Tollywoodm

కింగ్ నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సీక్వెల్ కథని సిద్ధం చేసి నాగార్జునని మెప్పించడం జరిగిందని సమాచారం.

 Samantha Heroine To Naga Chaitanya For Bangarraju Movie

ఇక ఇందులో బంగార్రాజు పాత్రతో పాటు, కొడుకు, మనవడు పాత్రలు కూడా ఉంటాయని టాక్.ఇందులో బంగార్రాజు మనవడు పాత్ర కోసం నాగ చైతన్యని ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం జరిగిందని తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్మేంట్ తో పాటు ఓపెనింగ్ జరుపుకుంటుందని టాక్.

బంగార్రాజు కోసం చైతూ జోడీగా సమంత-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగ చైతన్యకి హీరోయిన్ ఉంటుందని, ఆ హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని ఇప్పటికే టెస్ట్ చేయడం జరిగిందని వినిపిస్తుంది.

అయితే కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఫైనల్ గా సమంత దగ్గర ఆగిపోయారని, చైతూకి జోడీగా సమంత అయిది పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఇక బంగార్రాజు ఫ్యామిలీ సినిమా కాబట్టి సమంత కూడా చేయడానికి ఒకే చెప్పెసినట్లు సమాచారం.

త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు