రూ.950 ఇవ్వండి మామయ్యా..! నాగ్ కి అదిరిపోయే షాక్ ఇచ్చిన సమంత.! చివరికి ఏమైంది?       2018-06-23   02:07:10  IST  Raghu V

న‌టిగానే కాదు, సేవా దృక్ప‌థంతో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ సమంత‌. పెళ్ళికి ముందు నుండే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థని స్థాపించింది. దీని ద్వారా ఎంతో మంది అనాధ‌ల‌కి అండ‌గా ఉంటుంది స‌మంత. గ‌తంలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.. దుస్తుల్ని వేలం వేసిన స‌మంత‌ ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది. ఇక త‌న పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్‌లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని కూడా ఫౌండేష‌న్‌కి అందజేసింద‌నే టాక్ న‌డిచింది. అయితే అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న త‌ర్వాత స‌మంత‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది. కుటుంబంలో స‌భ్యురాలిగా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రోవైపు తోటి వారికి సేయం చేస్తుంది సామ్‌.

-

అయితే ఈ సేవా కార్యక్రమాల విషయంలోనే కొన్నిరోజుల క్రితం నాగ్ కు అనుకోని షాక్ ఇచ్చిందట సమంత. ఒక రూ.950 ఉంటే ఇవ్వండి మామయ్యా అంటూ అడిగేసరికి నాగార్జున మతిపోయిన వాడిలా వెర్రిచూపులు చూశాడట. తాను వింటున్నది నిజమేనా అనుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయిన నాగ్.. సమంత వద్ద కనీసం రూ.950 కూడా లేకపోవడం ఏమిటి.. చైతూని అడగకుండా తనను అడగడం ఏమిటని అయోమయంలో పడిపోయాడట.

అప్పుడు సమంత చెప్పింది విన్న తర్వాతగానీ నాగ్ కుదటపడలేదట. ఇంతకీ సమంత అడిగిన ఆ డబ్బు… అక్షయపాత్ర ఫౌండేషన్ తో కలిసి తాను చేపడుతున్న చిన్నారులకు భోజనం పెట్టే పథకం కోసం అట. కేవలం రూ.950 లతో ఒక చిన్నారి ఏడాది పొడవునా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తారని, అక్షయపాత్ర సంస్థ ద్వారా చిన్నారులకు ఉచితభోజనం పెడుతున్నామని చెప్పిందట సామ్. అందుకు మీ వంతు కూడా ఇవ్వండి మాయయ్యా అని వివరంగా చెప్పేసరికి నాగ్ తన వంతుగా చాలా పెద్దమొత్తంలోనే చెక్ ఇచ్చారట.

-

అక్షయ పాత్ర ద్వారా చిన్నారులకి స‌మంత చేస్తున్న ఈ సాయాన్ని నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు. మ‌రికొంద‌రు ఈ సేవా కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఉత్సుక‌త చూపుతున్నారు. ద‌క్షిణాది టాప్ హీరోయిన్‌గా ఉన్న స‌మంత‌కి వ‌రుస హిట్స్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం యూ టర్స్‌, సీమ‌రాజా, సూప‌ర్ డీలక్స్‌, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రాల‌తో బిజీగా ఉంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.