చైతూకి ముద్దు పెట్టిన సాయి పల్లవి... హార్ట్ అయిన సమంత  

Samantha Hearts On Chaitanya And Sai Pallavi Kissing Scene - Telugu Chaitanya And Sai Pallavi Kissing Scene, Samantha Hearts, Sekhar Kammula, Tollywood

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత.ఇక ఈ భామ అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతుంది.

Samantha Hearts On Chaitanya And Sai Pallavi Kissing Scene

పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్స్ కెరియర్ ముగిసిపోతుంది.కాని సమంత కెరియర్ దూసుకుపోతుంది.

మరో వైపు పెళ్లి తర్వాత సమంత భర్త నాగ చైతన్య కూడా మంచి జోష్ లోకి వచ్చి హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు.ఇప్పటికే వెంకీ మామ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న చైతు ప్రస్తుతం సాయి పల్లవితో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

వేలెంటైన్స్ డే సందర్భంగా లవ్ స్టొరీ చిత్ర యూనిట్ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ టీజర్ లో మెట్రో ట్రైన్ లో చైతుకి సాయి పల్లవి ముద్దు పెడుతుంది.ఈ సన్నివేశంలో ముద్దు పెట్టిన తర్వాత చైతు ఏడవడం, దానికి సాయి పల్లవి కౌంటర్ గా ముద్దు పెడితే ఎవరైనా ఏడుస్తారా అని అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సాంగ్ టీజర్ గురించి చైతు వైఫ్ సమంత సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించింది.ఈ టీజర్ చాలా బాగుందని, అయితే సాయి పల్లవి ముద్దు పెట్టడం చూసిన తర్వాత ఒక్కసారి గుండె ఆగినంత పనైంది అని ఫన్నీగా పోస్ట్ చేసింది.

నా తల కొన్ని సెకండ్స్ పాటు పని చేయలేదని చెప్పింది.ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని మరో అమ్మాయి ముద్దు పెడితే ఏ భార్యకైన కాస్తా ఇబ్బందికరంగానే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు