సమంత ప్రెగ్నెన్సి ప్లాన్స్ ఎంత వరకు నిజం?

అక్కినేని సమంత త్వరలో ప్రెగ్నెంట్ అవ్వబోతుంది అంటూ తమిళ మీడియాతో పాటు కొన్ని తెలుగు మీడియాల్లో కూడా కథనాలు వస్తున్నాయి.ఆమె తల్లి కావాలనుకుంటుంది.

 Is Heroine Samantha Has Pregnancy Plans In Next Year , Film News, Movie News, Sa-TeluguStop.com

అందుకోసమే ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకునేందుకు సిద్దం అయ్యిందంటున్నారు.గతంలోనే సమంత ఒకసారి సినిమాలు కమిట్‌ అవ్వడం ఆలస్యం అవ్వడంతో ఆమె తల్లి కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

కాని ఈసారి మాత్రం ఆమె నిజంగా నే ప్రెగ్నెన్సీ కోసం సినిమా లకు బ్రేక్ తీసుకునే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ప్రెగ్నెన్సీ విషయం మై క్లారిటీ రాలేదు కాని ఆమె సినిమా లకు నో చెబుతున్న విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఉంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం చేస్తున్న శాకుంతలం సినిమా తర్వాత తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో నయనతార తో కలిసి చేయబోతున్న సినిమా కాకుండా మరే సినిమాను కమిట్‌ అవ్వడం లేదు.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయిన విఘ్నేష్‌ శివన్‌ సినిమాను వచ్చే నెలలో పూర్తి చేస్తారట.

ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యేలా ఈమె ప్లాన్‌ చేస్తోందని సమాచారం అందుతోంది.

Telugu Break, Nayanthara, Samantha, Shaakuntalam, Shakuntalam, Tamil, Tollwyood,

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకోగల సత్తా ఉన్న నటి సమంత అనడంలో సందేహం లేదు.అలాంటి సమంత ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా తల్లి కాబోతుండటం అందరికి ఆశ్చర్యంగా ఉంది.చాలా మంది హీరోయిన్స్‌ ఈమద్య కాలంలో హీరోయిన్స్ గా అయిన తర్వాత తల్లి అవుతున్నారు.

ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి కూడా వెళ్తున్నారు.కనుక ఎలాంటి డౌట్ లేకుండా సమంత తల్లి అయ్యి మళ్లీ హీరోయిన్ గా సినిమాలు చేస్తుందేమో అంటూ కొన్ని తమిళ మీడియా సంస్థలు కథనాలు అల్లుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube