గుడ్ న్యూస్ : సమంత 'శాకుంతలం' రిలీజ్ ఎప్పుడో తేలిపోయింది

సమంత హీరోయిన్ గా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలైంది, కానీ విడుదల విషయమై దర్శకుడు గుణ శేఖర్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.దాంతో సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గుణ శేఖర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

 Samantha Guna Shekhar Movie Shakuntalam Movie Release Date Details, Guna Sekhar, Samantha, Shaakuntalam, Shaakuntalam Release Date, Samantha Shaakutalam, Shaakuntalam Movie Update-TeluguStop.com

తాజాగా సినిమా మేకింగ్ ఒక్కటి సరిపోదు విడుదల చేయాలి.ఆ విషయం తెలియకపోతే సినిమా తీయకుండా ఉండాలి అంటూ గుణ శేఖర్ ని తీవ్రంగా విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.

ఎవరు ఎంత విమర్శించినా కూడా గుణ శేఖర్ తాను అనుకున్న సమయంలోనే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.వచ్చే డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

 Samantha Guna Shekhar Movie Shakuntalam Movie Release Date Details, Guna Sekhar, Samantha, Shaakuntalam, Shaakuntalam Release Date, Samantha Shaakutalam, Shaakuntalam Movie Update-గుడ్ న్యూస్ : సమంత శాకుంతలం#8217; రిలీజ్ ఎప్పుడో తేలిపోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శాకుంతలం సినిమా షూటింగు పూర్తయి చాలా నెలలైనా కూడా సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ కాస్త ఎక్కువగా ఉందట.అందుకే అంతర్జాతీయ స్థాయి సంస్థతో గ్రాఫిక్స్ వర్క్ చేయించడంలో కాస్త జాప్యమైందని, అందుకే సినిమా విడుదలకు ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

డిసెంబర్ మొదటి వారంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు గుణ శేఖర్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతుంది.సమంత యొక్క అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Guna Shekhar, Samantha, Shaakuntalam, Shakunthalam, Telugu-Movie

రుద్రమదేవి సినిమా తర్వాత దర్శకుడు గుణ శేఖర్ నుండి రాబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.ఈ సినిమాకు దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఆయన సమర్పణలో సినిమా రాబోతున్నది కనుక కచ్చితంగా మ్యాటర్ ఉన్న సినిమా అవుతుంది అంటూ శాకుంతలం సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదంటే మళ్లీ వాయిదా వేస్తాడా అనేది చూడాలి.

గతంలో రుద్రమదేవి పలు వాయిదాల తర్వాత విడుదలైన విషయం తెలిసింది.మరి శాకుంతలం సినిమాకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube