థాంక్యూలో భర్త కోసం గెస్ట్ రోల్ చేస్తున్న సమంత

నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టొరీ మూవీ రిలేజ్ కి రెడీ అయ్యింది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

 Samantha Guest Role In Thank You Movie-TeluguStop.com

ఇక తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన సారంగాదరియా సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.ఈ నేపధ్యంలో లవ్ స్టొరీ సినిమాతో మరో సక్సెస్ ని నాగ చైతన్య తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడని అర్ధమవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మొదటి సారి ఒక హర్రర్ ఎలిమెంట్ ని నాగ చైతన్య టచ్ చేయబోతున్నాడు.

 Samantha Guest Role In Thank You Movie-థాంక్యూలో భర్త కోసం గెస్ట్ రోల్ చేస్తున్న సమంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినిమాలో చైతూకి జోడీగా ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో హాట్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

నాగ చైతన్య, సమంత కాంబినేషన్ మీద జనానికి మంచి అభిప్రాయం ఉంది.సమంత మొదటి సినిమా ఏమాయ చేసావే నుంచి మొన్నటి మజిలీ వరకు వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి.

పెళ్లి తర్వాత సమంత చైతన్య కెరియర్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తుంది.అవసరం అయితే చైతన్య సినిమాలో మరో సారి చేయడానికి కూడా రెడీ అవుతుంది.

వారిద్దరి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుంది అంటే కచ్చితంగా ఆమె చేయడానికి సిద్ధంగా ఉంటుందనే టాక్ ఉంది.ఈ నేపధ్యంలో థాంక్యూ సినిమాలో కూడా ఆమె గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

అయితే ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుంది అనేది చిత్ర యూనిట్ రివీల్ చేసేంత వరకు తెలియదు.

#SamanthaGuest #Vikram K Kumar #Naga Chaitanya #Thank You Movie #SamanthaGuest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు