కాజల్‌, తమన్నాలు దక్కించుకోలేనిది సమంతకు దక్కింది

బాలీవుడ్‌ నుండి సౌత్ వరకు హీరోలు హీరోయిన్స్‌ పలువురు వెబ్‌ సిరీస్ ల ఎంట్రీ ఇస్తున్నారు.ప్రస్తుతం థియేటర్లు లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రేక్షకులు ఓటీటీ ద్వారా వినోదాన్ని పొందుతున్నారు.

 Samantha Gets Appreciations For The Family Man, Kajal, Movie News, Samantha,  Th-TeluguStop.com

హీరోలు మరియు హీరోయిన్స్‌ పలువురు వెబ్‌ సిరీస్‌ ల్లో నటించేందుకు సిద్దంగా ఉన్న ఈ సమయంలో స్టార్ ఫిల్మ్‌ మేకర్స్ కూడా వాటిని తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నారు.పెద్ద ఎత్తున వెబ్‌ సిరీస్ లను రూపొందిస్తున్నారు.

తెలుగులో తమన్నా ఇప్పటికే రెండు వేబ్‌ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రాగా కాజల్‌ కూడా ఒక వెబ్‌ సిరీస్ ను చేసింది.వీరిద్దరు కూడా వెబ్‌ సిరీస్ లతో సక్సెస్‌ లను దక్కించుకోలేక పోయారు.

ఈ ఇద్దరు ముద్దుగుమ్మల తర్వాత వచ్చిన సమంత విషయంలో కూడా పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు.కాని అనూహ్యంగా కాజల్‌ మరియు తమన్నాల మాదిరిగా కాకుండా సమంత ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం సీజన్‌ కు సంబంధించి సమంత ప్రశంసలు దక్కించుకుంటుంది.

Telugu Kajal, Samantha, Thamanna, Web-Movie

సమంత తో పాటు ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్ కు అంతా కూడా అభినందనలు అందుకుంటున్నారు.ఈ సమయంలో సమంత ఇలాంటి పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం నిజంగా ఆమె ఘట్స్ కు ఒప్పుకోవాల్సిందే అంటున్నారు.ఆమె ను ముందు ముందు ఎలాంటి పాత్రల్లో చూస్తామో ఈ వెబ్‌ సిరీస్ తో తెలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

వెబ్‌ సిరీస్ తో సక్సెస్‌ దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే అందులో ఆమె డీ గ్లామర్‌ గా కనిపించడం కూడా ఆమెకు మంచి మార్కులు పడేలా చేసింది.ప్రస్తుతం వెబ్‌ సిరీస్ నెట్టింట వైరల్‌ అవుతుంది.

మరిన్ని ఇలాంటి పాత్రలను సమంత చేస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube