అనుష్క అడుగుజాడల్లో సమంత.. ఏం చేస్తుందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ఎంత చెప్పిన తక్కువే.యోగ టీచర్ గా ఉన్న ఆమె సినిమాల్లోకి వచ్చి మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆమె హీరోయిన్ గా మారింది.

 Samantha Following Anushka In Story Selections, Lady Oriented Movies, Baahubali,-TeluguStop.com

ఆ తర్వాత ఆమె తీస్తున్న ఒకో సినిమా ఆమె కెరియర్ ని హై రేంజ్ కి చేర్చింది.అరుంధతి సినిమాతో ఆమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది.
ఆ తర్వాత ఆమె ఏ సినిమా తీసిన ఆమె పాత్ర స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంది.అలానే మిర్చి సినిమా.ఆ తర్వాత బాహుబలి వంటి సినిమాల్లో నటించి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇలా అవ్వడానికి ఆమె కథల ఎంపికే కారణం.

పాత్ర పెద్దదైన.చిన్నదైన.

గ్లామర్ పాత్ర అయిన.డీ-గ్లామర్ పాత్ర అయిన సినిమాలో ఆమెకంటూ ప్రత్యేకత ఉంటేనే నటిస్తుంది.

అందుకే స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఇక అలానే అనుష్క అడుగుజాడల్లోనే నడుస్తుంది సమంత కూడా.

ఇప్పటికే సమంత తమిళ్, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.అయితే అనుష్క నే ఫాలో అవుతూ.

గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ తనకు, తన నటనకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలను ఎంచుకుంటుంది సమంత.ఇప్పటికే అనుష్క లనే ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట.

రంగస్థలం, యూ టర్న్, ఓ బేబీ, సూపర్ డీలక్స్ వంటి చిత్రాల్లో నటించింది.ఈ సినిమాలు అన్ని కూడా ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్నవే.ఇప్పుడు ఫ్యామిలీ మెన్2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.ఈ సిరీస్ లో టెర్రరిస్ట్ గా నెగటివ్ పాత్రలో నటిస్తోంది సమంత.

ఇక్కడితో ఆగలేదు.గేమ్ ఓవ‌ర్‌ దర్శకుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు సిద్ధం అయ్యింది సమంత.

నిశ్శబ్దం సినిమాలో అనుష్క ఎలాగైతే మూగ అమ్మాయిగా నటించిందో ఈ సినిమాలో సమంత మూగ అమ్మాయి ల నటించబోతోందట.దీంతో సమంత అనుష్క అడుగుజాడల్లో నడుస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube