ఎట్టకేలకు అమ్మను పరిచయం చేసిన సమంత... ఇన్నాళ్లకు ఎందుకో?  

Samantha First Time Introduced Her Mother-

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు తన తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నాయనే విషయం తెల్సిందే.సినిమా కెరీర్‌ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సమంత ఎప్పుడు కూడా తన తల్లిని పరిచయం చేయలేదు.కనీసం షూటింగ్స్‌కు కూడా తల్లిదండ్రులతో సమంత ఎప్పుడు వచ్చింది లేదు...

Samantha First Time Introduced Her Mother--Samantha First Time Introduced Her Mother-

ఇతర హీరోయిన్స్‌ ఎప్పుడు కూడా తల్లి పక్కనే ఉంటుంది.కాని సమంతకు మాత్రం తల్లి ఎప్పుడు పక్కన ఉన్నట్లుగా కనిపించలేదు.ఆమద్య చెన్నైలోని సమంత తల్లిదండ్రులను కలిసేందుకు మీడియా ప్రయత్నించగా మీడియా ప్రతినిధులపై సమంత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఇక నాగచైతన్యతో జరిగిన పెళ్లిలో కూడా సమంత తల్లిదండ్రులు కనిపించలేదు.ఈ విషయంపై అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయమై చర్చించుకోవడం కనిపించింది.

Samantha First Time Introduced Her Mother--Samantha First Time Introduced Her Mother-

ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా తన తల్లి గురించి బాహాటంగా కాని, మీడియా ముందు కాని, సోషల్‌ మీడియా ద్వారా కూడా స్పందించని సమంత ఇన్నాళ్లకు తన తల్లి ఫొటోను ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్‌ చేసింది.సమంత తల్లి ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.తల్లి ఫొటో పోస్ట్‌ చేయడంతో పాటు కాస్త ఎమోషనల్‌ మెసేజ్‌ను కూడా సమంత పోస్ట్‌ చేసింది.

తన తల్లి తన కోసం ప్రతి రోజు ప్రార్ధన చేస్తుంది.ఆమె ప్రార్ధనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను.ఆమె చేసే ప్రార్ధనల్లో మ్యాజిక్‌ ఉంటుంది, ఆమె తన కోసం కాకుండా మా కోసం ప్రతి రోజు ప్రార్థన చేస్తుందని, ఆమె తన తల్లి అవ్వడం ఆనందంగా ఉందని సమంత పోస్ట్‌ చేసింది.

సమంత ఇన్నాళ్లకు తల్లి ఫొటోను పోస్ట్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగి పోయినట్లేనా అంటూ సోషల్‌ మీడియాలో జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.