సుదీర్ఘ విరామం తర్వాత జాయిన్‌ అయిన సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గత జనవరి నుండి షూటింగ్ లకు దూరంగా ఉంది.దాదాపు పది నెలల తర్వాత సమంత సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Samantha Finally Joins In Movie Shooting , Aha Ott, Samanth, Samjam, Telugu Flim-TeluguStop.com

మద్య మద్యలో యాడ్‌ షూట్‌ లు వెబ్‌ సిరీస్‌ టాక్‌ షో అంటూ రకరకాలుగా ఆమె మీడియా ముందుకు వచ్చినా ఈ సారి మాత్రం ఆమె సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చింది.తమిళంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లోనే జరుగుతుంది.

ఆ సినిమా కు విగ్నేష్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.

తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా ఈ సినిమాను చేస్తున్నాడు.

ఒక్క హీరోను ఇద్దరు హీరోయిన్స్ ప్రేమించడం అనేది ఈసినిమా కాన్సెస్ట్‌ గా సమాచారం అందుతోంది.

రికార్డు స్థాయిలో ఈ సినిమాను తెలుగు లోకి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే తెలుగు లో ఈ సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించింది.

ఈ సినిమాలో సమంత మరియు నయనతారల మద్య సన్నివేశాలు చాలా బాగా వస్తాయని అంటున్నారు.విజయ్‌ సేతుపతి చాలా సహజంగా ఉంటుందని కూడా అంటున్నారు.చాలా కాలం తర్వాత వస్తున్న ఒక ట్రై యాంగిల్‌ లవ్‌ స్టోరీ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

సమంత మరో వైపు ఒక తెలుగు సినిమాకు కూడా కమిట్‌ అయ్యింది.అది వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది.

సమంత ప్రస్తుతం సామ్‌ జామ్‌ షో కోసం వరుసగా డేట్లు కేటాయిస్తుంది.కనుక సినిమాల ఎంపిక ఆలస్యం అవుతుందనే సమాచారం అందుతోంది.

మరో వైపు ఈ సినిమా షూటింగ్‌ కోసం సమంత చెన్నై కూడా వెళ్లబోతుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube