మూడు యుట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం కేసు వేసిన సమంత..?

Samantha Files Defamation Suit Against Three Youtube Channels

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ వ్యక్తిగత విషయాలను బాగా సీరియస్ గా తీసుకుంటారు.ఇక వారి పరువు కు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

 Samantha Files Defamation Suit Against Three Youtube Channels-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు వాళ్ళ పరువు బయట హాట్ టాపిక్ గా మారడంతో నేరుగా పరువు నష్టం కూడా వేస్తుంటారు.ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు ఇలా చేయగా తాజాగా సమంత కూడా పరువు నష్టం కేసు వేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సమంత.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.

 Samantha Files Defamation Suit Against Three Youtube Channels-మూడు యుట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం కేసు వేసిన సమంత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.కేవలం నటిగానే కాకుండా బిజినెస్ లలో కూడా బాగా బిజీగా ఉంటూ బిజినెస్ ఉమెన్ గా నిలిచింది.

పలు సంస్థలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టింది.ఇక తను ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వెనుతిరిగి చూడకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా నటించింది.

Telugu Suit, Filed, Samantha, Samanthanaga, Samatha, Suman Tv, Tollywood, Top Telugu Tv, Tude Channels-Movie

అలా తన నటనతో, అందంతో ప్రేక్షకులను అభిమానులను మార్చుకుంది.ఇక తన తొలి సినిమాలోనే తనతో నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది.తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి బంధుమిత్రుల సమక్షంలో నాలుగేళ్ల కిందట ఘనంగా పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత అక్కినేని కోడలు అయినా సమంతకు మరింత అభిమానం పెరిగింది.

అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరింత క్రేజ్ సంపాదించుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, నాగ చైతన్యల జంట క్యూట్ కపుల్ గా నిలిచింది.

ఇక పెళ్లి తర్వాత నాగచైతన్యతో పలు సినిమాలలో నటించింది.బుల్లితెరపై వాణిజ్య ప్రకటనలలో కూడా చేసింది.

అంతేకాకుండా కొన్ని బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

Telugu Suit, Filed, Samantha, Samanthanaga, Samatha, Suman Tv, Tollywood, Top Telugu Tv, Tude Channels-Movie

మొత్తానికి అక్కినేని కోడలుగా ఒక హోదా సంపాదించుకుంది.కానీ ఆ హోదాను ఇటీవలే కోల్పోయింది సమంత.గత కొన్ని రోజుల నుండి సమంత.

నాగచైతన్యను విడిపోతుందని బాగా వార్తలు వచ్చాయి.ఇదంతా అబద్ధమని అందరూ అనుకోగా ఈ మధ్యనే సమంత, నాగ చైతన్య తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇక ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.అందరూ సమంతపై తప్పు పడ్డారు.మంచి కుటుంబాన్ని వదులుకుందని విమర్శలు చేశారు.తప్పంతా సమంతదేనని తనకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బాగా వార్తలు వినిపించాయి.

అయినా కూడా సమంత వాటిని పట్టించుకోకుండా తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

Telugu Suit, Filed, Samantha, Samanthanaga, Samatha, Suman Tv, Tollywood, Top Telugu Tv, Tude Channels-Movie

అయినా కూడా సమంత పై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి.దీంతో తాజాగా మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్ పల్లి కోర్టు లో పరువు నష్టం కేసు వేసింది.సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ అనే ఛానల్స్ తమపై రకరకాల కథనాలు సృష్టిస్తున్నారని అందుకు తమ పరువు పోతుందని పరువు నష్టం దావా వేసిందని తెలిసింది.

అంతేకాకుండా వెంకట్ రావు అడ్వకేట్ పై కూడా పిల్ దాఖలు చేయగా మరికొద్ది సేపట్లో సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తుంది.

#Suit #Tude Channels #Samatha #Popular Tv #Suman Tv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube