ఆ బ్యాగ్ ఇప్పటికీ తన ఫేవరెట్ అంటున్న సమంత.. ఖరీదు తెలిస్తే?

సమంత టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ.తన అందాలతో ఎప్పుడు ట్రెండీగా ఉంటుంది.

 Samantha, Tollywood, Vuitton Bag Cost Shocks , Favoruitemlatest News-TeluguStop.com

అంతేకాదు నటనలో కూడా ఓ స్టార్ హోదాని అందుకుంది. ఏం మాయ చేశావే సినిమాతో అందరిని మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ.

అప్పటి నుండి వెనుతిరిగి చూడకుండా ఎన్నో వరుస సినిమాలలో నటించింది.ఇక గ్లామర్ విషయంలో పెళ్లి తర్వాత కూడా తగ్గేదిలేదంటూ.

బాగా రెచ్చిపోతుంది.ఇదిలా ఉంటే ఇప్పటికీ తనకు ఓ బ్యాగ్ అంటే ఫేవరేట్ అని తెలిపింది.

ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది సమంత.తన వస్త్ర ధారణతో తెగ ఫోటో షూట్ చేయించుకుంటూ ట్రెండీ గురించి తెలుపుతూ ఉంటుంది.అంతేకాకుండా తను ధరించే ప్రతి ఒక్క కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపింది.ఇక ఈ బ్యూటీ దేశీయ చేనేత వస్త్రాలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది.

నిజానికి సమంతా కంటే మరే టాలీవుడ్ బ్యూటీ కూడా ట్రెండును ఫాలో కాదనే చెప్పవచ్చు.

లూయి విట్టోన్ అంతర్జాతీయ ఫ్యాషన్ హౌస్ లలో లెదర్ క్వాలిటీ డిజైన్స్ వంటి వాటితో ప్రత్యేక బ్రాండ్ గా రూపొందింది.

చేతిరుమాలు నుంచి ఆభరణాలు వరకు ప్రతి ఒక్క వస్తువు బ్రాండ్ తోనే కూడి ఉంటుంది.ఇందులో ఎక్కువగా సెలబ్రెటీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.అంతేకాకుండా 60 ఏళ్ల కిందట ఈవ్ సన్ లోరాన్ అనే మరో కంపెనీ కూడా ప్రసిద్ధి చెందినది.ఇందులో కూడా ప్రతి ఒకటి ఎంత బ్రాండ్ గా ఉంటాయి.

ఇందులో ఏ వస్తువు కొన్నా వేలల్లో, లక్షల రూపాయలలో ఉంటాయి.

ఇక అందుకు సంబంధించిన ఓ బ్యాగ్ గురించి సమంత కొన్ని విషయాలు పంచుకుంది.

తను టీనేజ్లో ఉన్నప్పుడు లూయి విట్టోన్ బ్యాగు కొనుక్కోవాలని మనసు పడిందట.ఇంతకీ ఆ బుజ్జి బ్యాగ్ ధర ఎంత ఉందో తెలుసా? 30 థౌసండ్ రూపీస్ ఓన్లీ.ఆ కాలాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అది ఇప్పటికీ తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube