గుణశేఖర్ ను తిట్టి పోస్తున్న నెటిజన్స్‌.. కారణం ఏంటంటే!

రుద్రమ దేవి సినిమా తర్వాత అయిదు ఆరు సంవత్సరాల పాటు మరే ప్రాజెక్ట్‌ ను మొదలు పెట్టని దర్శకుడు గుణశేఖర్‌ ఎట్టకేల సమంత తో శాకుంతలం అనే పీరియాడిక్‌ మూవీని మొదలు పెట్టాడు.ఆయన అదృష్టం బాగా లేదో మరేంటో కాని సినిమా ను పట్టాలెక్కించే సమయానికి కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలు అయ్యింది.

 Samantha Fans Angry On Shakuntalam Movie Director Gunashekhar , Gunashekhar, Sam-TeluguStop.com

దాంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే ఆపేశారు.సినిమా నుండి సమంత లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నేడు సమంత పుట్టిన రోజు.ఈ సందర్బంగా ఆయన నుండి అభిమానులు శాకుంతలం సినిమా అప్ డేట్ ను ఆశించారు.

కాని ఎలాంటి సినిమా కు సంబంధించిన అప్ డేట్ ను ఇవ్వలేదు.దానికి తోడు ఈ సినిమా నుండి ఎలాంటి పోస్టర్ ను విడుదల చేయలేదు.

శాకుంతలం సినిమా నుండి సమంత ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది.పెద్ద ఎత్తున సమంత పుట్టిన రోజు వేడుకను సోషల్‌ మీడియాలో చేసుకుంటున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయం.

గుణశేఖర్‌ శాకుంతలం సినిమా ఫస్ట్‌ లుక్ ను ఆమె బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయలేక పోవడం ఆయన అసమర్ధత అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం కరోనా పరిస్థితులు అలా ఉన్నాయి, దానికి గుణ శేఖర్‌ ను ఎలా బాధ్యుడిని చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి గుణశేఖర్‌ దర్శకత్వం లో రూపొందుతున్న శాకుంతలం సినిమా గురించి నేడు సమంత పుట్టిన రోజు సందర్బంగా ఎలాంటి సందడి లేకపోవడం ఆ సినిమా కు మైనస్ మరియు అభిమానులకు నిరుత్సాహం.

అందుకే గుణ శేఖర్ ను నెటిజన్స్ కొందరు విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube