రాంగ్ కాల్స్ తో ఇబ్బంది పడ్డ అంటున్న సమంత  

Samantha Facing Wrong Calls Issue, Tollywood, Wrong Calls, Threatening Calls, Samantha Akkineni - Telugu @samanthaprabhu2, Samantha Akkineni, Samantha Facing Wrong Calls Issue, Threatening Calls, Tollywood, Wrong Calls

ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి రాంగ్ కాల్స్ సమస్య ఉంటుంది.సమయం, సందర్భం లేకుండా కస్టమర్ కేర్ అంటూ, ఇన్సూరెన్స్, లాటరీ అంటూ రకరకాల ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి.

TeluguStop.com - Samantha Facing Wrong Calls Issue

అయితే అలా కాల్స్ చేసేవారికి మన నెంబర్ ఎలా వెళ్ళింది అనేది అర్ధం కాని విషయంగా ఉండిపోతుంది.అయితే మోసాలు చేసే వారికి, వ్యాపారాలు చేసే వారికి వ్యక్తిగత ఫోన్ నెంబర్లు సంపాదించడం పెద్ద కష్టమైన విషయం కాదు.

కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్న మరుక్షణం ఆ నెంబర్ చాలా మందికి వెళ్ళిపోతుంది.దీనిపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టకపోయిన మొబైల్ నెంబర్ మాఫియా అనేది రియాలిటీలో క్రింది స్థాయి నుంచి ఉంది.

TeluguStop.com - రాంగ్ కాల్స్ తో ఇబ్బంది పడ్డ అంటున్న సమంత-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదంతా పెద్ద నెట్ వర్క్ గా సాగుతుంది.ముందుగా మొబైల్ నెంబర్ తీసుకోవడం తరువాత వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం, తరువాత మన జీవితాలలోకి ఎంటర్ అయిపోవడం ఇప్పుడు చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది.

ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ రాంగ్ కాల్స్ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇప్పుడు అలాంటి అనుభవమే తనకి కూడా ఎదురైందని స్టార్ హీరోయిన్ సమంత చెబుతుంది.

తాజాగా తనకు జరిగిన అనుభవం గురించి మీడియాతో పంచుకుంది.తనకు కూడా తెలియని ఫోన్ కాల్స్ చాలా వచ్చేవని, వాళ్ల నుంచి లేనిపోని తలనొప్పులు చాలానే పడ్డానని సమంత గుర్తు చేసుకుంది.

వాళ్ల నుంచి చుక్కలు చూసానంటుంది.ఫేక్ మెసేజులతో తన ఫోన్ నిండిపోయేదని, అలాంటివి చూసినపుడు చాలా విసుగు వచ్చేదని చెప్పుకొచ్చింది.ఏవేవో పిచ్చి పిచ్చి మెసేజులు ఫోన్‌కు వస్తుంటాయని, కస్టమర్ కేర్ వాళ్లు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటారని చెప్పింది.పర్సనల్ నెంబర్ ఎక్కడా ఇవ్వకపోయినా కూడా వాళ్లకు ఎలాగోలా తెలిసిపోయి ఫోన్ చేసే వాళ్లని చెప్తుంది.

అలాంటి రాంగ్ కాల్స్ వచ్చినపుడు చిరాకు వస్తుందని చెప్పింది.ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే ఎయిర్ పోర్ట్ వెళ్లక ముందు నుంచే హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి కాల్స్, మెసేజులు వస్తున్నాయని చెప్పింది.

ఫుడ్ డెలివరీ చేసుకుందాం అనుకుంటే కూడా అదో తలనొప్పి అంటూ కామెంట్ చేసింది సమంత.వీళ్ల పోరు భరించలేకే చాలా సార్లు తాను ఫోన్ నెంబర్ కూడా మార్చాల్సి వచ్చిందని, అయిన కూడా రాంగ్ కాల్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయాని సమంత మీడియాతో పంచుకుంది.

#Wrong Calls #SamanthaFacing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Facing Wrong Calls Issue Related Telugu News,Photos/Pics,Images..