సమంత షాకింగ్ ట్వీట్..! నేను భయపడుతున్నాను అని ఇప్పుడే అర్ధమయ్యింది..!   Samantha Expresses Her Feeling About Her Next Movie     2018-12-01   13:23:05  IST  Sainath G

గత దశాబ్దం నుండి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దాదాపు అగ్ర హీరోలందరితో నటించి హిట్స్ అందుకుంది. సమంత హీరోయిన్ అంటే హిట్ గారంటీ అన్న సెంటిమెంట్ సంపాదించుకుంది. ఆ టాప్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత మంచి పేరు తెచ్చుకుంది.

ఈ ఏడాది సమంత కెరీర్ సక్సెఫుల్ గా రన్ అయ్యింది. వరుస విజయాలు అందుకుంది. రంగస్థలం, యు టర్న్, అభిమన్యుడు, మహానటి సినిమాలతో దూసుకెళ్లింది. త్వరలో ఆమె నటించిన “సూపర్ డీలక్స్‌” రిలీజ్ అవ్వనుంది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించారు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే సమంత తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసారు.

సూపర్ డీలక్స్ చిత్రంలో నటించడం గురించి మాట్లాడుతూ “నా ప్రతిభకు సవాల్ విసిరే పాత్రగా మారింది. నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన, ఆసక్తికరమైన క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఆ పాత్రను చూసి బాగా భయపడ్డాననే విషయాన్ని గ్రహించాను. నేను చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను అని సమంత ఎమోషనల్‌ ట్వీట్ చేసింది.

Samantha Expresses Her Feeling About Next Movie-Samantha Akkineni Tweet Samantham

నా జీవితంలో నేను ఎప్పుడు ఓ సవాల్‌ను అంత సీరియస్‌గా అంగీకరించలేదు. వాస్తవానికి మనం ఆలోచించే దానికంటే మనం ఎక్కువగా బలవంతులమని భావిస్తాం. అందుకే ప్రతీ విషయాన్ని సవాల్‌ అని భావించం. కానీ సూపర్ డీలక్స్ సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. నా కెరీర్‌లో మరో సరికొత్త ఆరంభం అని సమంత ట్వీట్ లో పేర్కొంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.