వామ్మో.. సమంత నాగ్ ను మించిపోయిందిగా..?  

Samantha to host Bigg Boss4 Dasara Special, Samantha akkineni, hosting, dussehra special, nagarjuna akkineni, bigg boss 4 telugu, Wild dog shooting - Telugu Bigg Boss 4 Telugu, Dussehra Special, Hosting, Nagarjuna Akkineni, Samantha Akkineni, Samantha To Host Bigg Boss4 Dasara Special, Wild Dog Shooting

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ఈ వారం అక్కినేని నాగార్జున కోడలు, స్టార్ హీరోయిన్ సమంత సందడి చేయనుంది.కొన్ని రోజుల నుంచి సమంత బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనుందని వార్తలు వైరల్ కాగా స్టార్ మా ప్రోమోను విడుదల చేయడంతో సమంత ఎంట్రీ కన్ఫర్మ్ అయింది.

TeluguStop.com - Samantha Doing Hosting More Than Nagarjuna

రేపు సాయంత్రం మూడు గంటల పాటు సమంత బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనుంది.

ప్రోమోలో “హాయ్, హల్లో, ఆదాబ్, నేను మీ నాగార్జున” అంటూ మొదట్లో మామ నాగార్జునను ఇమిటేట్ చేసిన సమంత .మామకు బదులుగా కోడలు పిల్ల సమంత బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్నట్టు తెలిపింది.“ఈరోజు నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు” అంటూ తాను నటించిన ఓ బేబీ సినిమాలోని డైలాగ్ చెప్పి సమంత మెప్పించింది.యూట్యూబ్ లో సమంత బిగ్ బాస్ ప్రోమోకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి.
కొందరు నెటిజన్లు యూట్యూబ్ లో హోస్ట్ గా సమంత నాగార్జున ను మించిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

TeluguStop.com - వామ్మో.. సమంత నాగ్ ను మించిపోయిందిగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గత సీజన్ లో నాగార్జున ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లగా ఆ సమయంలో రమ్యకృష్ణ హోస్ట్ చేశారు.ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీలో ఉన్నారు.

మనాలీకి హైదరాబాద్ మధ్య దూరం ఎక్కువ కావడంతో నాగ్ స్థానంలో కోడలు పిల్ల సమంత వచ్చారు.
సమంత ఎపిసోడ్ అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 4 దసరా స్పెషల్ గా రాబోతున్న ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#SamanthaTo #Hosting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Doing Hosting More Than Nagarjuna Related Telugu News,Photos/Pics,Images..