సమంత స్టామినా మరీ ఇంత తక్కువనా? ఫ్యాన్స్‌ నిరుత్సాహం  

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత హీరోయిన్‌గా ‘యూటర్న్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. యూటర్న్‌ చిత్రంకు మంచి క్రేజ్‌ రావడంతో సినిమా భారీగా వసూళ్లు చేస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం కేవలం ఆరు కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. 9 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం కేవలం ఆరు కోట్లను మాత్రమే వసూళ్లు చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలపాలయ్యారు.

Samantha Disappointed To Her Fans With UTurn-

Samantha Disappointed To Her Fans With UTurn

‘యూటర్న్‌’ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మంచి కథ, కథనం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని సినిమా ఫలితం మాత్రం తారు మారు అయ్యింది. ముఖ్యంగా కలెక్షన్స్‌ విషయంలో సినిమా తీవ్రంగా నిరాశ పర్చిందంటూ ప్రచారం జరుగుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేసి తప్పు చేశామని బాధ పడుతున్నారు. సమంత స్టార్‌ హీరోయిన్‌ అవ్వడంతో ఆమె కోసం అయినా ప్రేక్షకులు వస్తారని అంతా ఆశించారు.

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు అధికంగా చేసిన అనుష్క ఫ్లాప్‌ సినిమాలకు కూడా మంచి వసూళ్లను రాబట్టడంలో సక్సెస్‌ అయ్యింది. కాని సమంత మాత్రం సక్సెస్‌ టాక్‌ వచ్చిన సినిమాలకు కూడా మంచి వసూళ్లను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. సమంత స్టామినా మరీ ఇంత తక్కువ ఏంటీ అంటూ అభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇదో హర్రర్‌ సినిమా అవ్వడం వల్ల అన్ని వర్గాల వారు ఈ చిత్రంను ఆధరించలేదనే టాక్‌ వినిపిస్తుంది.

Samantha Disappointed To Her Fans With UTurn-

ఇందులో సమంత స్టామినాకు సంబంధం లేదు అంటున్నారు. సమంత హీరోయిన్‌గా ఒక కమర్షియల్‌ మూవీ వస్తే అప్పుడు ఆమె స్టామినా ఏంటో తెలుస్తుందని అభిమానులు అంటున్నారు. మొత్తానికి యూటర్న్‌ కారణంగా సమంత ఫ్యాన్స్‌ నిరుత్సాహంకు గురవుతున్నారు.