హిట్ ఇచ్చిన దర్శకురాలికే నో ఛాయస్ అంటున్న సమంత

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు చేస్తూనే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి లేడీ ఒరియాంటెడ్ కథలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది.ఈమె చివరిగా నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.

 Samantha Demand To Mass Story For Naga Chaitanya-TeluguStop.com

ప్రస్తుతం మరో లేడీ ఒరియాంటెడ్ సినిమాకి రెడీ అవుతుంది.తాజాగా కోలీవుడ్ లో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న సినిమాకి ఫైనల్ అయిన ఎందుకనో మరల తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో కాస్తా ఫ్రీ టైం దొరకడంతో తన భర్త కోసం మంచి కథలని వెతికే పనిలో సమంత కొంత బిజీగా ఉంది.భర్తని ఎలా అయిన కమర్షియల్ హీరోగా నిలబెట్టి స్టార్ ఇమేజ్ తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

 Samantha Demand To Mass Story For Naga Chaitanya-హిట్ ఇచ్చిన దర్శకురాలికే నో ఛాయస్ అంటున్న సమంత-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు ఎక్కువగా ప్రేమ కథ సినిమాలతోనే హిట్స్ కొట్టిన చైతూ ప్రస్తుతం లవ్ స్టొరీ అనే సినిమాని శేఖర్ కమ్ములతో చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత పరశురాం దర్శకత్వంలో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

అది కూడా క్లాసిక్ టచ్ ఉన్న సినిమానే.ఈ రెండు సినిమాల తర్వాత అయిన మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ పడాలని అలాంటి రఫ్ కథ కోసం వెతుకుతున్న సమంత కొత్త కథలు వింటుంది.

అయితే సమంతకి సూపర్ హిట్ ఇచ్చిన ఓ బేబీ దర్శకురాలు నందినిరెడ్డి చైతూతో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ తెరకెక్కించాలని అనుకోని కథతో వచ్చింది.అయితే దీనికి చైతూ ఒకే చెప్పిన సమంత మాత్రం కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది.

హిట్ ఇచ్చిన దర్శకురాలు అయిన భర్త విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని మంచి మాస్ ఎలిమెంట్స్ ఉండే కథని సిద్ధం చేయాలని ఆమెకి చెప్పినట్లు సమాచారం.

#SamanthaDemand #Akkineni #Nandini Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు