డీగ్లామర్ పాత్రలో మెరిసిన సమంత… ది ఫ్యామిలీ మెన్ 2 టీజర్ టాక్  

పెళ్లి తర్వాత స్టార్ హీరోయిన్ సమంత రెగ్యులర్ కి భిన్నంగా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంది.రంగస్థలం, మజిలీ, ఓబేబీ సినిమాలలో విభిన్న పాత్రలు చేసి నటిగా కూడా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.

TeluguStop.com - Samantha De Glamour Role In The Family Man 2

ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమాలో మెయిన్ లీడ్ చేయబోతుంది.ఈ సినిమా మైథలాజికల్ ప్రేమ కావ్యంగా తెరపైకి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కెరియర్ లో పాజిటివ్ రోల్స్, హీరోయిన్ పాత్రలే చేసిన సమంత నెగిటివ్ రోల్స్ లో కూడా సత్తా చాటాలని అనుకుంటుంది.గతంలో విక్రమ్ 10 సినిమాలో సమంత డ్యూయల్ రోల్ చేసింది.

TeluguStop.com - డీగ్లామర్ పాత్రలో మెరిసిన సమంత… ది ఫ్యామిలీ మెన్ 2 టీజర్ టాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందులో ఒకటి బందిపోటు రాణి పాత్ర కూడా ఉంది.ఆ పాత్రలో విలనీగా ఇప్పటికే సమంత మెప్పించింది.

ఇక డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లోకి అడుగుపెట్టిన సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది.

మనోజ్ భాజ్ పాయ్ మెయిన్ లీడ్ గా రాజ్ అండ్ డీకే దర్శకత్వం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తెరకెక్కింది.అంది మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.దానికి కొనసాగింపుగా ది ఫ్యామిలీ మెన్2ని తెరకెక్కించారు.

ఈ సినిమాలో ప్రియమణి మనోజ్ భాజ్ పాయ్ భార్యగా నటించింది.ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి అటు ఫ్యామిలీ జీవితంలో, ఇటు ప్రొఫెషనల్ కెరియర్ లో పడే ఇబ్బందులతో దర్శకద్వయం ది ఫ్యామిలీ మెన్ 2 కథాంశం నడిపించారు.టెర్రరిస్ట్ ల నుంచి ప్రజలని రక్షించే బాధ్యతలో ఉన్న హీరో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో అతని మానసిక సంఘర్షణని టీజర్ లో ఎలివేట్ చేశారు.ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ లో టెర్రరిస్ట్ గా నటిస్తుంది.

దీనికోసం ఆమె పూర్తి డీగ్లామర్ పాత్రలో మరోసారి కనిపించబోతుంది టీజర్ ఎండ్ లో సమంత పాత్రని రివీల్ చేసి కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు.

#Samantha #Manoj Bajpai #Priyamani #Raj And DK

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Samantha De Glamour Role In The Family Man 2 Related Telugu News,Photos/Pics,Images..