మరో ఐటెంసాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..అంతకు మించి అనేలా?

సాధారణంగా ప్రతిఒక్క సినిమాలో ప్రత్యేక పాట ఉండడం సర్వ సాధారణం.అయితే ఒక్కప్పుడు ఈ ప్రత్యేక పాటలో నటించాలంటే ప్రత్యేకంగా డాన్సర్ లు ఉండేవాళ్ళు.

 Samantha Dance In Another Item Song In Vijay Devarakonda Liger Movie Details,  S-TeluguStop.com

కానీ ప్రస్తుతం ఇలాంటి ప్రత్యేక పాటలలో నటించడానికి స్టార్ హీరోయిన్లు ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే తమన్నా,కాజల్,శృతిహాసన్ వంటి హీరోయిన్స్ ముందుకు వస్తున్నారు.

ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమాలోని ఊ అంటావా మావ ఊ ఊ అంటావా? అనే పాటలో నటించారు.

ఈ పాట అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా సమంత పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోయింది.

సమంత విడాకుల తరువాత ఐటమ్ సాంగ్ ద్వారా కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే దర్శకుడు ముందుగా సమంతను సంప్రదించినపుడు సమంత ఈ పాటలో నటించడానికి ఒప్పుకోలేదు.

కానీ అల్లు అర్జున్ చెప్పడంతో ఈ పాటలో నటించిన సమంత మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా సమంతకి సంభందించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Puri Jagannath, Item, Liger, Pushpa, Samantha, Specila, Tollywood-Movie

సమంత మరొక ఐటెంసాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో ఐటెంసాంగ్ చేయడం కోసం  ముందుగా బాలీ వుడ్ బ్యూటీనీ తీసుకున్నట్టు ముందు వార్తలు వినిపించాయి.అయితే ప్రస్తుతం సమంత పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.ఇదే కనుక నిజం అయితే సమంత ఊవా అంటావా పాటను మించేలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube