ప్రముఖ డైరెక్టర్‌కు ఫోన్ చేసి ఏడ్చేసిన సమంత..

సమంత-నాగచైతన్య డైవోర్స్ మ్యాటర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న సంగతి అందరికీ విదితమే.ఈ విషయమై అటు నాగచైతన్య కాని సమంత కాని నాగార్జున కుటుంబ సభ్యులు కాని స్పందించడం లేదు.

 Samantha Cried While Talking To Director , Samantha, Nagachaitanya, Srinu Vaitla-TeluguStop.com

లవ్ స్టోరి’ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లోనూ సామ్ పాల్గొనడం లేదు.దీంతో అనుమానాలు ఇంకా ఎక్కువవుతున్నాయి.

గతంలో చై చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొన్న సామ్.‘లవ్ స్టోరి’ ఫిల్మ్ గురించి కనీసం ఓ ట్వీట్ లేదా పోస్ట్ చేయకపోవడం ద్వారా వారిద్దరి మధ్య గ్యాప్ ఉందని నెటిజన్లు, సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇకపోతే అక్టోబర్ 7న నాగచైతన్య-సమంత పెళ్లి రోజునే ఈ విషయమై క్లారిటీ వచ్చే చాన్సెస్ ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఆ రోజున విడాకుల ప్రకటన ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి.

ఇకపోతే సామ్ ప్రొఫెషన్ పరంగా చాలా సీరియస్, హానెస్ట్‌గా ఉంటుందని డైరెక్టర్స్ అంటుంటారు.తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు – శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ‘దూకుడు’ సినిమా విడుదలై పదేళ్లయిన సందర్భంగా సమంతతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి శ్రీనువైట్ల ఆసక్తికర విషయాలు తెలిపారు.

Telugu Dookudu, Mahesh Babu, Nagachaitanya, Samantha, Samantha Cried, Srinu Vait

‘దూకుడు’మూవీ ఇస్తాంబుల్‌ షూటింగ్‌ గురించి మాట్లాడారు.ఇస్తాంబుల్‌లో మొదటి షెడ్యూల్‌ షూట్‌ ఎంతో సరదాగా జరిగిందని చెప్పాడు.ఆ ఫిల్మ్ షూట్‌ని మూవీ యూనిట్ సభ్యులు బాగా ఎంజాయ్ చేశారని పేర్కొన్నాడు.అయితే, ఓ రోజు అనుకోకుండా మూవీ షూట్ వాయిదా పడగా, సామ్ షాపింగ్‌కు వెళ్తానని అడిగగా, తాను ఓకే చెప్పానని శ్రీనువైట్ల తెలిపాడు.

దాంతో ఆమె బయలు దేరి వెళ్లిపోయింది.వెళ్లిన పది నిమిషాలకే తనకు ఫోన్ చేసి బాగా ఏడ్చేసిందని చెప్పాడు.ఏమైంది సమంత అని తాను అడగగా, తాను ఆత్మాహుతి దాడిని కళ్లారా చూశానని చెప్పి, సామ్ బాగా ఏడ్చేసిందని శ్రీను వివరించాడు.అయితే, అటువంటి సంగతులు అక్కడ కామన్ అని, వాటిని వదిలేయాలని చెప్పినా సామ్ మాత్రం అదే షాక్‌లో ఉందని డైరెక్టర్ శ్రీనువైట్ల పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube