ఓ యంగ్ హీరోతో సమంతా ప్రేమలో పడింది .త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.
ఈ విషయం ఆ నోటా .ఈ నోటా వినిపించింది కాదు, స్వయంగా సమంతానే చెప్పింది.తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేసింది.
తాను ఒక యంగ్ హీరోను ప్రేమిస్తున్నాననీ, తనకి అతను చాలా కాలంగా తెలుసని అంది.తన అభిప్రాయాలను .అభిరుచులను .ఆదర్శభావాలను అతను గౌరవిస్తాడనీ, అందుకే అతనితో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది.
పెళ్లి తరువాత మ్యారీడ్ స్టేటస్ కి తగిన పాత్రలను చేస్తాననీ, అలాంటి పాత్రలు చేయడం అతనికి కూడా ఇష్టమేనని అంది.
తమ ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారనీ .ఇక పెళ్లి ఎప్పుడు అనేది త్వరలో తాను ఎనౌన్స్ చేస్తానని చెప్పింది.ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? తెలుగు .తమిళ భాషల్లో పెళ్లి కాని కథానాయకులు ఎవరున్నారు? అనే విషయాన్ని ఇప్పుడిక సమంతా అభిమానులు సెర్చ్ చేయడం ఖాయం.