మళ్ళి సమంత అంటా !     2015-11-26   08:30:53  IST  Raghu V

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో పూర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ లో షూటింగ్ పూర్తవగానే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే ఎన్టీఆర్ జనవరి నుంచి కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తాడు. కొరటాల శివ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని, శ్రీమంతుడు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. జనతా గ్యారేజ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మళయాల అగ్రహీరో మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తిరు ఈ చిత్రానికి సినిమాతోగ్రాఫీ బాధ్యతలు చేపడతారు.

దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయిపోయాడు. ఇక మిగిలింది హీరోయిన్ మాత్రమె. కథానాయిక పాత్రకు సమంత ను అనుకుంటున్నారని సమాచారం. 45 రోజుల కాల్షీట్లు కావాలని కొరటాల శివ అడిగారంట. అర్జెంట్ గా అన్ని డేట్స్ ఉన్న అగ్ర కథానాయిక సమంత ఒక్కతే. అందుకే సమంత తో పని కానిచ్చే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ – సమంత కలిసి ఇప్పటికే బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస చిత్రాల్లో నటించారు. ఇది కుడా ఫిక్స్ అయిపోతే ఈ ఇద్దరి కాంబినేషన్ లో నాలుగోవ చిత్రం అవుతుంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.